India to America: కోవిడ్ ఆంక్షల సడలింపుతో తిరిగి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కొత్తగా ఇండియా టు అమెరికా నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసు ప్రారంభమైంది. ఆ వివరాలు చూద్దాం.
దాదాపు పదేళ్ల అనంతరం తిరిగి ఇప్పుడు ఇండియా నుంచి నేరుగా విమానాలు అమెరికాకు పయనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకూ ఇండియా నుంచి అమెరికాకు వెల్లాలంటే దుబాయ్ లేదా లండన్ మీదుగా అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి. ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉన్నందున..నాన్‌స్టాప్ ఫ్లైట్స్ అవసరం ఏర్పడింది. ఐటీ పెరిగే కొద్దీ రెండు దేశాల మధ్య సంబంధాలు పెరిగాయి. కనెక్టింగ్ ఫ్లైట్ తప్ప మరో అవకాశం లేదు. గతంలో అంటే 2007లో అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines)సంస్థ షికాగో నుంచి ఢిల్లీకు నాన్‌స్టాప్ ఫ్లైట్స్ ప్రారంభించింది. అయితే ఐదేళ్ల అనంతరం ఆ సర్వీసుల్ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 2012లో రద్దు చేసింది. తరువాత కోవిడ్ కారణంగా మొత్తం విమాన సర్వీసులే రద్దయ్యాయి. ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు తొలగి తిరిగి అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లభించింది. ఈ సందర్భంగా తిరిగి ఇండియా-అమెరికా నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. అమెరికా ఎయిర్‌లైన్స్ సంస్థ తిరిగి ఆ సర్వీసుల్ని ప్రారంభించింది. న్యూయార్క్ నుంచి నేరుగా ఢిల్లీకు విమాన సేవలు ఐదురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీకు(Newyork to NewDelhi Nonstop Flight) తొలి నాన్‌స్టాప్ విమానం నవంబర్ 13వ తేదీన చేరుకుంది. ప్రస్తుతం వీకెండ్స్‌లో ఈ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రెండవ నాన్‌స్టాప్ విమాన సర్వీసును అమెరికాలోని సియాటెల్ నుంచి బెంగళూరుకు మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి. అనంతరం న్యూయార్క్-ముంబై, శాన్‌ఫ్రాన్సిస్కో-బెంగళూరు మధ్య మరో రెండు సర్వీసులు ప్రారంభించే యోచనలో ఉంది. నాన్‌స్టాప్ సర్వీసులకు ప్రస్తుతం బోయింగ్ 777 విమానాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 304 మంది ప్రయాణించవచ్చు. ఎకానమీ క్లాస్‌లో 216, ప్రీమియం ఎకానమీలో 28, బిజినెస్ క్లాస్‌లో 52, ఫస్ట్‌క్లాస్‌లో 8 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఫుడ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అదే సమయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ దేశీయంగా ఇండిగోతో(Indigo Airlines)జత కట్టింది. నాన్‌స్టాప్ ఫ్లైట్స్ ద్వారా ఇండియా చేరుకున్న ప్రయాణీకులు దేశంలోని స్వస్థలాలకు వెళ్లేందుకు ఇండిగో ఏర్పాటు చేస్తుంది.
Also read: Postmortem After Sunset: ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టంకు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook