భారత ప్రభుత్వం చేపట్టిన ఆధార్ పద్ధతి వల్ల ఎలాంటి ప్రైవసీ సమస్య ఉండదని బిల్ గేట్స్ తెలిపారు. ఆధార్ కాన్సెప్ట్ తనకు నచ్చడం వల్లే తాను వరల్డ్ బ్యాంకు సహాయంతో బిల్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇతర దేశాలలో కూడా ఈ పద్ధతి అమలయ్యేలా ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. ఆధార్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన నందన్ నీలేకని తను ప్రోత్సాహం ఇస్తున్న ప్రాజెక్టులో కూడా కీలక బాధ్యతలు చేపడుతున్నట్లు గేట్స్ తెలిపారు. ఆధార్ పద్ధతి వల్ల నిజంగానే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.
ఆధార్ కేవలం బయో ఐడి వెరిఫికేషన్ స్కీమ్ మాత్రమేనని.. అలాంటప్పుడు ప్రైవసీ సమస్యలు ఎలా వస్తాయని బిల్ గేట్స్ అన్నారు. 2016లో కూడా నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న బిల్ గేట్స్, ఆధార్ పట్ల సదభిప్రాయాన్నే వెల్లడి చేశారు. పెద్ద పెద్ద ధనిక దేశాలు కూడా ఇలాంటి ప్రాజెక్టు రూపకల్పన చేయలేదని.. ఆ ఘనత భారతదేశానికి దక్కుతుందని తెలిపారు
భారతదేశం ప్రవేశపెట్టిన ఆధార్ లాంటి కార్డులను ప్రతీ దేశం ప్రవేశపెట్టాలని, ఏ దేశమైనా తమ ఆర్థికంగా పురోగతి సాధించి ఆ రంగంలో పటిష్టతను సాధించాలంటే... ఇలాంటి పథకాలను ప్రోత్సహించాలని.. నాణ్యమైన ఫలితాలు పొందడానికి ఆధార్ లాంటి పథకాలు సహకరిస్తాయని బిల్ గేట్స్ తెలిపారు
ఆధార్ గొప్ప ప్రయోగం: బిల్ గేట్స్