మార్చి 29న 979, ఇప్పుడు 8356 కరోనా పాజిటివ్ కేసులు.. కారణమేంటో తెలుసా..

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి కరోనా వైరస్ తీవ్ర దాల్చుతోంది. ముంబైలోని ధారవిలో కొత్తగా ఆదివారం 15 కేసులు నమోదయ్యాయని, కోవిడ్-19తో ధారావి నలుగురు మృతిచెందారని తెలిపారు.

Last Updated : Apr 12, 2020, 05:25 PM IST
మార్చి 29న 979, ఇప్పుడు 8356 కరోనా పాజిటివ్ కేసులు.. కారణమేంటో తెలుసా..

ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి కరోనా వైరస్ తీవ్ర దాల్చుతోంది. ముంబైలోని ధారవిలో కొత్తగా ఆదివారం 15 కేసులు నమోదయ్యాయని, కోవిడ్-19తో ధారావి నలుగురు మృతిచెందారని తెలిపారు. ముంబై కార్పొరేషన్ అధికారులు దారావి ఏరియాలో ఇంటింటికి వెళ్లి కరోనా స్క్రీనింగ్ టెస్టులతో పాటు రెండున్నర కిలోమీటర్లు పరిధిలో ఉండే ఈ మురికివాడను వివిధ జోన్లుగా విభజించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కాగా దేశంలోనే ఎక్కవగా 17,61 కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదు రాష్ట్రంలో ప్రస్తుతం 14,43 మంది చికిత్స పొందుతున్నారని, 208మంది కరోనాతో పోరాడి కోలుకోగా.110మంది ఈ మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మార్చి 29న దేశంలో 979 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు 8356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఇంతకు ముందు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పరిమితంగా ఉండేదని, గత వారం రోజుల్లో వేగవంతం కావడంతో కేసుల సంఖ్య పెరిగిందని అన్నారు. వీటిలో 20 శాతం కేసులకు సుమారుగా 1,671 మందికి ఐసీయూ సపోర్ట్ అవసరమవుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ 250 పడకలు, వీటిలో 50 ఐసీయూ పడకలు, మరోవైపు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో 500 పడకలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  

తమిళనాడులో 500 పడకల సామర్థ్యానికి విస్తరించబడుతుందని, అహ్మదాబాద్, కోజికోడ్, కటక్, భువనేశ్వర్లలో కూడా ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గత 24 గంటల్లో 909 కేసులతో ఇప్పటివరకు 8,356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 కొత్త మరణాలు సంభవించాయని ఇప్పటివరకు 716 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News