కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు..!

Last Updated : Oct 19, 2018, 06:04 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు..!

వచ్చే ఎన్నికల ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయా? ఏడో వేతన సవరణ సంఘం సిఫారసులకు మించి కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ పెంపు అంశాలను పరిశీలించమని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ.. ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయా? అంటే అధికార వర్గాలు అవుననే అంటున్నాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే బేసిక్ పే పెంచనున్నారని మా అనుబంధ వెబ్‌సైట్ zeebiz.com తన కథనంలో పేర్కొంది. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది’ అని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 'ప్రభుత్వం ఫిట్‌మెంట్ కారకాన్ని పెంచుతుంది. కేంద్ర ఉద్యోగుల బేసిక్ పే రూ.3000 పెరుగనుంది. ఫిట్మెంట్ కారకం 2.57 నుంచి 3.0కి పెరగవచ్చు.' అని అన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫిట్మెంట్ కారకాన్ని 3.68కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ ప్రభుత్వం ఫిట్మెంట్ కారకాన్ని 3.0కి పెంచితే, అప్పుడు ఉద్యోగుల బేసిక్ పే రూ.18000 నుండి రూ.21000లకు పెరుగుతుంది. 7వ పే కమిషన్ కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.18,000కు సిఫారసు చేసింది. అయితే, ఉద్యోగులు 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

అటు  వేతనాలతో పాటు.. పదవీ విరమణ వయసును 60 నుండి 62కి కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.

జనవరి 26న..

కేంద్ర ప్రభుత్వం వేతన పెంపును ప్రకటన ఎప్పుడు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నివేదికల ప్రకారం, జీతాల పెంపు ప్రకటన నూతన సంవత్సరంలో ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 26న కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్తారు. కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు నూతన సంవత్సరంలో కచ్చితంగా తమ జీతాల పెంపుపై ప్రకటన వస్తోందని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదికల ప్రకారం, జనవరి 2019 నుండి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి.

 అటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, రాజస్థాన్, త్రిపుర, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా ఎన్నికల ముందు ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దసరా, దీపావళి పండగల సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ ఉద్యోగులకు డీఏలను పెంచుతూ బోనస్‌లు ఇస్తున్నాయి. ఒడిశా కూడా 7వ వేతన సంఘం సిఫార్సులకు సంబంధించి ఉద్యోగులకు హామీ ఇచ్చిందని తెలిసింది.  

2016లో జీతం పెరిగింది

2016 ప్రారంభంలో, కేంద్ర ఉద్యోగుల మూలవేతనాన్ని 14 శాతానికి పెంచింది ప్రభుత్వం. అయితే ఈ వేతనాలతో సిబ్బంది సంతోషపడలేదు. వారు కనీస వేతనం మరియు ఫిట్మెంట్ కారకాన్ని మరింత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ 7వ పే కమిషన్ సిఫార్సుల కంటే ఎక్కువ.

ఇటీవలే రైల్వే శాఖ 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ఉద్యోగులకు ప్రకటించింది. ఈ నిర్ణయంతో 12.26 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్దిపొందనున్నారు.

Trending News