Update on 7th Pay Commission: ఆ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. DA 4 శాతం పెంపు

Bihar Govt Hikes DA: బీహార్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డీఏ పెంపునకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 07:55 PM IST
Update on 7th Pay Commission: ఆ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. DA 4 శాతం పెంపు

7th Pay Commission Latest Update : ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచి గిఫ్ల్ అందించగా.. తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నాలుగు శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కొత్త నిబంధనలకు ఆమోద ముద్ర వేసింది. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో మొత్తం 6 అజెండాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల 38 శాతం డీఏ పొందుతుండగా.. తాజాగా 4 శాతం పెంపుతో 42 శాతానికి చేరుకుంది. పెంచిన డీఏ జనవరి నెల నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. 

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన సోమవారం కేబినెట్ మీటింగ్ జరిగింది. సుదీర్ఘంగా చర్చించిన మంత్రి మండలి.. డీఏను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచే అమలు చేసేందుకు ఒకే చెప్పింది. తాజా డీఏపై పెంపుతో ప్రభుత్వం రూ.1690 కోట్ల అదరనపు భారం పడనుంది. దీంతో పాటు బీహార్ కంటింజెన్సీ ఫండ్‌ను రూ.350 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఈ నిధులను ఉపయోగించనున్నారు. 

అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి రెగ్యులర్ టీచర్లను మాత్రమే విధుల్లోకి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఉపాధ్యాయులను నియమకాలు చేపట్టనుంది. పంచాయతీ నుంచి మున్సిపల్ బాడీల వరకు ఉపాధ్యాయుల పునరుద్ధరణ నిబంధన రద్దు చేసింది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు బీపీఎస్ పరీక్ష నిర్వహించనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా పరిణించనుంది. దాదాపు 2.25 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించనుంది. రెగ్యులర్ అయిన ఆకర్షణీయమైన జీతంతో అన్ని సౌకర్యాలు కల్పించనుంది.  

Also Read: 7th pay commission, DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. ఏకంగా 8% డీఏ హైక్?

అయితే కొత్త నిబంధనలలో కమిషన్ ద్వారా ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి.. ఆ తర్వాత జిల్లాల్లో వారి పోస్టింగ్‌లు ఇవ్వనుంది. కొత్త నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఒకే చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు.. రెగ్యులర్ ఉపాధ్యాయులుగా మారిన తరువాత.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికి బదిలీలకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: PM Kisan Samman Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News