Corona Patient Missing: ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లో కరోనావైరస్ సంక్రమణ రోజు రోజుకూ పెరుగుతోంది. కోవిడ్ 19 వైరస్ ( Coronavirus ) ను కట్టడి చేయడానికి అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేస్తున్నారు. మరో వైపు ఘాజీపూర్ ( Ghazipur Patient Missing) లో కోవిడ్-19 సోకిన 42 మంది మాయం అయ్యారు. ఈ విషయం తెలిసినప్పటి నుంది అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్థానికులు కలవర పడుతున్నారు. వారిని పట్టుకుందాం అని వెళ్లిన పోలీసులు వారు ఇచ్చిన అడ్రెస్, ఫోన్ నెంబర్ అన్నీ ఫేక్ అని తెలిసి తలపట్టుకుంటున్నారు.
Read This Story Also: IPL 2020 UAE Facts: క్రకెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే
కోవిడ్ 19 ( Covid 19) సోకిన మొత్తం 42 మంది అడ్రెస్ లేకుండా పోయారు అని ఘాజీపూర్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కు జిల్లా అడిషనల్ డీఎమ్ లేఖరాసి తెలిపారు. ఇటీవలే పరీక్షల్లో వీరికి కరోనా పాజిటీవ్ అని తేలింది. కానీ వీరు అటు ఆసుపత్రుల్లో.. ఇటు హెమ్ ఐసోలేషన్ లో లేరు అని లేఖలో తెలిపారు. వీరి జాడ కనుక్కోవడానికి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే వీరిలో ఎంత మంది దొరుకుతారు.. పైగా వారు ఎంత మందికి వైరస్ అంటిస్తారేమో అని స్థానికులు కలవరపడుతున్నారు.
Read This Story Also: Covid 19 In Telangana: తెలంగాణలో పెరుగుతోన్న రికవవరీ రేటు