సిక్కు అల్లర్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుపై కొత్తగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Last Updated : Jan 10, 2018, 05:01 PM IST
సిక్కు అల్లర్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుపై కొత్తగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో సిట్ మూసేసిన.. కొత్త సిట్ చేత 186 కేసులను తిరిగి దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 1984లో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తరువాత జరిగిన హత్యాకాండ(సిక్కుల ఊచకోత)పై దర్యాప్తు చేయడానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, అందులో ముగ్గురు సభ్యులు ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది.

భారత ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం, సిట్ నియామకం కోసం బుధవారం పేర్లను సూచించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదన చేసింది. ఈ కమిటీకి మాజీ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ఒక రిటైర్ అధికారి, సర్వీస్ లో ఉన్న పోలీస్ అధికారి సభ్యులుగా ఉంటారని ధర్మాసనం వెల్లడించింది.

రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డీఐజీ ర్యాంక్ కంటే తక్కువగా ఉండవచ్చని కూడా సుప్రీం స్పష్టం చేసింది.  241 కేసుల్లో 186 కేసులను దర్యాప్తు లేకుండా మూసివేసిందని రిటైర్ జడ్జీలు రాధాకృష్ణన్, పంచల్ సమర్పించిన నివేదిక క్రమంలో సుప్రీంకోర్టు కేసుల పునర్విచారణపై ఆదేశాలు జారీచేసింది. 

Trending News