విషపూరిత నీళ్లు తాగి 14 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర విషాదం నెలకొంది. బోరు పంపు నుంచి వచ్చిన నీళ్లు తాగి 14 మంది మరణించారు.

Last Updated : Mar 14, 2018, 11:13 AM IST
విషపూరిత నీళ్లు తాగి 14 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర విషాదం నెలకొంది. బోరు పంపు నుంచి వచ్చిన నీళ్లు తాగి గత 24 నెలలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని ఏఎన్ఐ పేర్కొంది. ఈ ఘటనలో మరో 38 మంది అస్వస్థతకు గురికాగా.. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషపూరితమైన నీళ్లను తాగడం వల్ల 110కి పైగా కిడ్నీ సంబంధిత కేసులు నమోదయ్యాయి.

యావత్మల్ జిల్లాలోని మహా గ్రామంలో బోరింగ్ (250 ఫీట్ల లోతు) నుంచి వచ్చిన నీటిని స్థానికులు యధావిధిగా తాగడంతో ఈ ఘటన జరిగింది.

"చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిపై మేము ప్రభుత్వానికి ఈ సమాచారం అందించాము. అయినా ప్రభుత్వం సరియైన ఏర్పాట్లు చేయలేదు. మేము సరైన వైద్య సదుపాయాన్ని కోరుకుంటున్నాము" అని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు.

యావత్మల్ లోని మహా గ్రామానికి ఈ 250అడుగుల లోతు ఉన్న బోర్వెల్ మాత్రమే నీటివనరు. గ్రామస్తులు ఈ నీళ్లనే ఉపయోగిస్తున్నారు. 'ఈ నీళ్లు నత్రజనితో కలుషితమవుతోంది. ఆ నీళ్లను తాగడంవల్ల స్థానికులకు మూత్రపిండ సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలిపారు. ఆచార్య వినోబా భావే గ్రామీణ ఆసుపత్రి డాక్టర్ అభ్యుదయ్ మేఘే కూడా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. "38 మందిని మా ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేయగా కెరాటిన్ అధిక మొత్తంలో ఉందని తెలిసింది. నీటిలో నత్రజని మోతాదు ఎక్కువగా ఉంది" అని అభ్యుదయ్ మేఘే చెప్పారు.

 

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలకు మంచినీళ్ళు అందించేలా చర్యలు చేపట్టింది.

Trending News