Mumbai Covid cases: ముంబైలో కోవిడ్ బీభత్సం.. థర్డ్‌ వేవ్‌కు రెడీ.. లాక్‌డౌన్‌ విధిస్తాం..

Mumbai Covid cases: ముంబైలో కోవిడ్ బీభత్సం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 10,860 కోవిడ్ కేసులు నమోదు. థర్డ్‌ వేవ్‌కు సిద్ధంగా ఉన్నామంటున్నారు మేయర్ కిశోరి పెడ్నేకర్‌. ముంబైలో లాక్‌డౌన్‌ కూడా విధిస్తామన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 08:59 PM IST
  • ముంబైలో కోవిడ్ బీభత్సం...
  • 24 గంటల వ్యవధిలో 10,860 కోవిడ్ కేసులు
  • కరోనా వల్ల తాజాగా ఇద్దరు మృతి
Mumbai Covid cases: ముంబైలో కోవిడ్ బీభత్సం.. థర్డ్‌ వేవ్‌కు రెడీ.. లాక్‌డౌన్‌ విధిస్తాం..

10,860 fresh Covid Cases In Mumbai, 2 Deaths Mumbai Tally 34% higher than yesterday : ముంబైలో రోజువారీ కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కోవిడ్ అక్కడ రోజురోజుకు విజృంభిస్తోంది. ముంబై సిటీని కరోనా హడలెత్తిస్తోంది. ముంబైలో తాజాగా ఒక్కరోజులో పదివేలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

అక్కడ కోవిడ్ (Covid) బీభత్సం మళ్లీ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 10,860 కోవిడ్ కేసులు (Covid cases) నమోదు అయ్యాయి. మొత్తం 
49 వేల 661 శాంపిల్స్‌ టెస్ట్ చేయగా.. అందులో 10,860 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే దాదాపు 89శాతం మందిలో కోవిడ్ లక్షణాలే లేవంటూ ముంబై (Mumbai) వైద్యాధికారులు పేర్కొన్నారు. 

తాజాగా కరోనా (Corona) బారినపడిన వారిలో 834 మంది హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా 654 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని చెప్పారు. కరోనా వల్ల తాజాగా ఇద్దరు మరణించారని వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలో కోవిడ్ యాక్టివ్‌ కేసుల (Covid Active‌ Cases) సంఖ్య 47,476 కి చేరింది. 

 

అయితే కోవిడ్‌ను అదుపులో పెట్టేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామంటూ ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్‌ (Mumbai Mayor Kishori Pednekar) పేర్కొన్నారు. ముంబైలో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని పెడ్నెకర్ తెలిపారు. 

తాము థర్డ్‌ వేవ్‌కు (Third wave) సిద్ధంగా ఉన్నామన్నారు కిశోరి పెడ్నేకర్‌. తగినన్నీ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. పలు హాస్పిటల్స్‌లలో 30 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జంబో కోవిడ్ సెంటర్స్‌ను (Jumbo Covid Centers‌) రెడీ చేశామని ఆమె తెలిపారు. కోవిడ్ కేసులు భారీగా పెరిగితే అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉనామని చెప్పుకొచ్చారు. ముంబైలో డైలీ కోవిడ్ కేసుల (Mumbai Daily Covid cases) సంఖ్య 20 వేలు దాటినట్లయితే లాక్‌డౌన్‌ (Lockdown) విధిస్తామంటూ కిశోరి పెడ్నేకర్ పేర్కొన్నారు. 

Also Read : Andhra Pradesh: కొత్తవలసలో ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా

ఇక ముంబై నుంచి గోవాకు (Goa) రెండు వేల మందితో వెళ్లిన కార్డెలియా క్రూజ్‌ షిప్‌లో కరోనా (Corona) బారిన పడిన అరవై ఆరు మందిని ముంబై (Mumbai) పోర్టుకు తరలించారు. వారికి మళ్లీ టెస్ట్‌లు (Tests) నిర్వహించనున్నార. నెగెటివ్‌ వచ్చే వరకు వారిని ఐసోలేషన్‌లో ఉంచనున్నారు.

Also Read : Delhi Corona Update: దేశ రాజధానిలో 5వేలకు పైగా కొత్త కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News