Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గోల్కొండ పరిసరాల ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 14, 2023, 09:56 AM IST
Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయా జెండాను ఎగురవేయనున్నారు. ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. గోల్కొండ కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. అదేవిధంగా వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను తెలిపారు.

==> వేడుకల కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డు మూసివేత  
==> వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు జారీ.
==> సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని  గోల్కొండ కోట వరకు అనుమతి.
==> ఏ గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ 
==> ఏ పింక్ పాసులున్న వాహనదారులు కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేయాలి.
==> బీ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర కుడి మలుపు తీసుకొని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాలి.
==> సీ గ్రీన్ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దరంలో ఉన్న ఓసీ/జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి
==> డీ ఎరుపు పాసులు ఉన్న వారు ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ చేయాలి
==> ఈ నలుపు పాసుల ఉన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ 
==> షేక్‌పేట, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అనుమతి ఇచ్చారు.

Also Read: Bhola Shankar: భోళా శంకర్ పెద్ద రాడ్డు.. టీమిండియాదే వరల్డ్ కప్.. ఇదేక్కడి సెంటిమెంట్ మావా బ్రో..!  

Also Read: Hakimpet Sports School Incident: అవసరమైతే ఉరి తీయిస్తాం.. లైంగిక వేధింపులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News