Weight Loss Tips At Home: ప్రస్తుతం స్థూలకాయం తీవ్ర సమస్యగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ అధిక బరువు కారణంగా చాలా మంది మధుమేహం, అధిక బీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారాలు తీసుకునే క్రమంలో డైట్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.
శరీర బరువుతో బాధపడేవారు రోజువారి డైట్లో భాగంగా తప్పకుండా కొన్ని ఆహారాలు, గింజలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా బాడీకి ప్రొటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా సబ్జా గింజలను ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
శరీర బరువును తగ్గించే సబ్జా గింజలు:
సబ్జా గింజలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే ఫైబర్ శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచి బరువును నియంత్రిస్తుంది. అయితే ఈ గింజలను ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కప్పు ముందుగా వేడి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే 4 నుంచి 5 టీస్పూన్ల గింజలను వేసి బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా నానిన తర్వాత ఆ గింజలు ఉబ్బడం మీకు కనిపిస్తాయి. ఈ గింజలు ఉబ్బి జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేస్తాయి. ఇలా తయారు చేసుకున్న నీటిని ప్రతి రోజు తాగితే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఈ ఆహారంల్లో కూడా వీటిని వినియోగించవచ్చు:
సబ్జా గింజలను మిల్క్ షేక్ లేదా స్మూతీల్లో వినియోగించడం వల్ల కూడా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
ప్రస్తుతం చాలా మంది ఈ విత్తనాలను డెజర్ట్‌లలో కూడా వినియోగిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
సబ్జా గింజలను సలాడ్ లేదా సూప్‌లో కూడా వినియోగిస్తే సులభంగా బరువు తగ్గుతారు.
సబ్జా గింజల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని సూప్‌లో కూడా వినియోగించవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం