Weight Loss Mistakes: బరువు పెరగడం వల్ల శరీర ఆకృతిలో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. బయటికి కనిపించడానికి హీనంగా కనిపిస్తారు. ఆధునిక జీవనశవి కారణంగా చాలామంది బరువు పెరిగి ఇదే సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు పాటించే క్రమంలో తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అకస్మాత్తుగా బరువు పెరిగితే వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.
అయితే చాలామంది బరువు తగ్గే క్రమంలో వివిధ డైట్లను పాటిస్తున్నారు. ఇంకొందరైతే మూడు పూటలా ఆహారాన్ని తీసుకోవడం మానేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఆహారాలు తీసుకోవడం మానుకోవడం శరీరానికి మంచిది కాదు. బరువు తగ్గడానికి తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకొని మాత్రమే ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలి.
ఆహారాలను తీసుకోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
ఆహారం తీసుకోకపోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని చాలామంది ఆహారాలను తీసుకోవడం మానుకుంటున్నారు. పొరపాటున కూడా ఇలా చేయవద్దు. ఇలా చేయడం వల్ల శరీరంలో పోషకాలని తగ్గిపోయి. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చాలామంది ఆహారాలను ఆరు ఏడు గంటలు గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నారు. ముఖ్యంగా నీటిని కూడా ఇలానే తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా.. చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆహారం తీసుకోకపోవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుందని అనుకుంటారు. కానీ ఇలా చేయడం శరీరానికి అంత మంచిది కాదు. పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్లే సులభంగా కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ దెబ్బ తినడం, జీర్ణక్రియలో ఇతర లోపాలు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా బరువు తగ్గే క్రమంలో పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి ఉపవాసం పాటించడం వల్ల రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకోకపోవడం వల్ల దాని ప్రభావం శరీర అవయవాలపై పడి రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకుంటే సులభంగా మీరు ఫలితాలు పొందవచ్చు. ఉపవాసాలు పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఆహారాలు తీసుకోవడం మానేయడం మంచిది కాదు.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook