Weight Gain 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు తగ్గడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే దీని వల్ల పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. బరువు పెరగడానికి చాలా మంది మార్కెట్ లభించే వివిధ రకాల ఉత్పత్తులను కూడా వినియోగిస్తున్నారు. వీటి వల్ల బరువు పెరగడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ఈ అంశంపై పలువురు నిపుణులు పరిశోధనలు చేశారు. సాధరణ వ్యక్తులతో పోలిస్తే.. ఈ సన్నంగా ఉన్న వ్యక్తులు అధికంగా శ్రమ చేయడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడినట్లు పరిశోధనలు పేర్కొన్నాయి. అయితే వీరు మంచి పోషకాలు ఆహారం తీసుకుంటే.. బరువు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. బరువు పెరిగే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బరువు పెరగడానికి సులువైన మార్గాలు ఇవే:
>>అరటిపండులో చాలా రకాల పోషకాలుంటాయి. కావున ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా బరువును పెంచడానికి కూడా సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా ఈ పండును తీసుకోవాలి. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్ల లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి.
>>త్వరగా బరువు పెరగాలనుకునే వారు.. ప్రతి రోజూ నానబెట్టిన బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఇ, ప్రొటీన్, మాంగనీస్, ఫైబర్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి.
>>ఎండుద్రాక్షలో కూడా శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తీసుకుంటే త్వరలోనే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం శరీరాన్ని దృఢంగా చేస్తాయి.
>>బరువు పెరగడానికి మామిడి పండ్లు కూడా సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు శరీరంపై ప్రభావం చూపి బరువును పెంచేందుకు సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.
>>నేరేడు పండులో శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో పుష్కలంగా కార్బోహైడ్రేట్ల ఉంటాయి. కావున బరువు నియంత్రించేందుకు సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా.
Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook