Vitamin D Supplements: విటమిన్ డి అనేది అతి ముఖ్యమైన పోషకం. శరీరంలోని ఇమ్యూనిటీని బలోపేతం చేయడమే కాకుండా ఎముకలను పటిష్టంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. ఇటీవలి కాలంలో జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా విటమిన్ డి లోపం చాలా ఎక్కువగా కన్పిస్తోంది. అయితే విటమిన్ డి లోపమున్నప్పుడు అందుకు తగ్గ పదార్ధాలు లేదా సప్లిమెంట్స్ ఎంతకాలం తీసుకోవాలనేది చాలామందికి తెలియదు.
సూర్యరశ్మిలో తగినంత సమయం గడపకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతోంది. విటమిన్ డి లోపం పూర్తి చేసేందుకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు లేదా కొన్ని ఆహార పదార్ధాలతో ఆ లోపం సరిచేయవచ్చు. సప్లిమెంట్స్ అయితే ఎంతకాలం తీసుకోవల్సి ఉంటుందో చెక్ చేద్దాం. విటమిన్ డి లోపం సరిచేసందుకు సప్లిమెంట్స్ తీసుకునే వ్యవధి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ వయస్సు, మీ శరీరం అవసరాలను బట్టి మారుతుంది. సాధారణంగా విటమిన్ డి లోపం తలెత్తినప్పుడు అత్యధికంగా అంటే 8-12 వారాలు ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అయితే వైద్యుని సలహా మేరకే ఎంతకాలం అనేది నిర్ణయమౌతుంది. మనిషిని బట్టి మారుతుంటుంది. కొంతమందికి తక్కువ మోతాదు అవసరమైతే మరి కొంతమందికి ఎక్కువ అవసరం కావచ్చు. కొంతమంది తక్కువ కాలం తీసుకోవల్సి వస్తే ఇంకొంతమంది దీర్ఘకాలం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
చాలామంది ట్యాబ్లెట్స్ డోసు పూర్తయ్యాక తిరిగి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఇది మంచిది కాదు. ట్యాబ్లెట్స్ కోర్స్ పూర్తయ్యాక డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యరశ్మికి ఎక్స్ పోజ్ అవుతుండాలి. ప్రత్యేకించి ఉదయపు ఎండ చాలా మంచిది. ఇలా చేయకుండా తిరిగి అదే పరిస్థితి ఎదురుకావచ్చు. శరీరంలో విటమిన్ డి కొరతను సరిచేసిన తరువాత రెగ్యులర్ చెకప్స్ చేస్తుండాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి కొరత పూర్తిగా తొలగిందో లేదో తెలుస్తుంది. విటమిన్ డి కొరత అనేది సాధారణంగా కన్పించే సమస్యే అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.