Vitamin C Importance: శరీర నిర్మాణంలో విటమిన్ సి పాత్ర చాలా కీలకం. రోజువారీ డైట్‌లో తప్పకుండా అవసరం. ఎందుకంటే విటమిన్ సి లోపిస్తే చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఎందుకంటే విటమిన్ సి అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఇది లోపిస్తే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి.
విటమిన్ సి అనేది శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ కారణంగా గాయాలు త్వరగా మానుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్ సి ఉండే ఆహారం తీసుకుంటే చర్మం మృదువుగా, నిగనిగలాడుతుంటుంది. విటమిన్ సి లోపముంటే తక్కువ వయస్సుకే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తాయి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. ఇక విటమిన్ సి లోపముంటే దంత సమస్య కూడా ఎదురౌతుంది. పళ్లు లూజ్ అయిపోతుంటాయి. చిగుళ్లు బలహీనంగా మారి రక్తం కారుతుంటుది. రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా త్వరగానే అలసిపోతుంటారు.
విటమిన్ సి కొరత ఏర్పడితే చర్మం ఎర్రబడటం, దద్దుర్లు రావడం, నోరు, పెదాలు, చర్మం అదే పనిగా డ్రై అవడం ఉటుంది. విటమిన్ సి లోపముంటే రక్త ప్రసరణలో అంతరాయం కలుగుతుంది. విటమిన్ సి లోపం కారణంగా జుట్టు త్వరగా రాలిపోతుంది. చర్మం పొడిబారుతుంది. చర్మం పెలుసుగా ఉండటం, నిర్జీవంగా ఉండటం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కేశాలు బలహీనమై రాలిపోతాయి. చిగుళ్ల సమస్య రావచ్చు.
అందుకే విటమిన్ సి లోపాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మీరు తీసుకునే డైట్‌లో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కాకపోయినా కనీసం వారంలో 3 సార్లు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే విటమిన్ సి లోపమనేది చాలా సమస్యలకు కారణమౌతుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలకు కారణమౌతుంది.
Also read: Liver Disease Symptoms: ఈ లక్షణాలు తేలిగ్గా తీసుకుంటే మీ లివర్ అవుట్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి