Tzield For Type 1 Diabetes: టైప్-1 డయాబెటిస్‌ ఉన్నవారికి గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌కి Tzield Drug..

Tzield For Type 1 Diabetes: టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి అమెరికా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. Tzield అనే  ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఔషధానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 05:06 PM IST
Tzield For Type 1 Diabetes: టైప్-1 డయాబెటిస్‌ ఉన్నవారికి గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌కి  Tzield Drug..

Tzield For Type 1 Diabetes: టైప్-1 డయాబెటిస్‌కు మొదటి నివారణ చికిత్సకు అమెరికా ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ ఔషధాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రోవెన్‌బియో, సనోఫీ ఉమ్మడిగా తయారు చేశారు. అంతేకాకుండా ఈ ఔషదానికి Tzield అనే పేరు కూడా పెట్టారు. ఇది టైప్-1 మధుమేహాన్ని నివారించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. దీన్ని వినియోగించడం వల్ల మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా డయాబెటిస్ రాకుండా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ (USFDA) నవంబర్ 2022లో ఈ ప్రత్యేక ఔషధాన్ని ఆమోదించింది.

ఇంతక ముందు ఇది ఎలా పని చేసేది:
టైప్-1 మధుమేహం స్వయం ప్రతిరక్షక ప్రతిచర్యగా పరిగణిస్తారు. ఈ ప్రతిచర్య ఇన్సులిన్‌ను తయారు చేసే ప్యాంక్రియాస్‌లోని కణాలను నాశనం చేసేందుకు దోహదపడుతుంది.  వీటిని బీటా కణాలు అంటారు. లక్షణాలు కనిపించడానికి ముందు ఈ ప్రక్రియ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు భిన్నంగా ఉంటుంది. కాబట్టి టైప్ 2 ఉన్నవారు జీవన శైలిలో పలు రకాల మార్పలు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ వయస్సు గల వారికే  ప్రయోజనకరం:
Tzield అనే  ఔషధం మధుమేహం రెండవ దశలో ఉన్నవారికి,  8 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఇది ప్రభావవంతంగా సహాయపడుతుంది. అమెరికన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..టైప్ -1 డయాబెటిస్‌కు ఇప్పటివరకు ఎటువంటి నివారణ చికిత్స లేవని.. ఈ ఔషధాన్ని వినియోగిస్తే సులభంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

క్లినికల్ ట్రయల్ ఫలితాలు:
క్లినికల్ ట్రయల్ ఫలితాలు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి అనుగుణంగానే వచ్చాని నిపుణలు తెలుపుతున్నారు. అయితే తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ ఔషధాన్ని వినియోగించవచ్చు. అంతేకాకుండా దీనిని వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News