Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయాల్లో జాగ్రత్త

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న సమయంలో సహజంగా చేసే కొన్ని పొరపాట్లు తరువాత ఖరీదైన వ్యవహారంగా మారుతాయి  ఈ 5 పొరపాట్లు మాత్రం ఎట్టిపరిస్థితిలో చేయకండి.

Last Updated : Sep 20, 2020, 09:37 PM IST
    • హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న సమయంలో సహజంగా చేసే కొన్ని పొరపాట్లు తరువాత ఖరీదైన వ్యవహారంగా మారుతాయి.
    • ఈ 5 పొరపాట్లు మాత్రం ఎట్టిపరిస్థితిలో చేయకండి.
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయాల్లో జాగ్రత్త

కోరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో చాలా మంది తమ ఆరోగ్యం ( Health ) విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో చాలా మంది ఆరోగ్య బీమా చేయించుకుంటున్నారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం పాలసీలు చేస్తున్నారు.

ఈ రోజుల్లో ప్రజలకు ఆరోగ్యంపై ధ్యాస పెరిగింది. హెల్త్ ఇన్సురెన్స్ అవసరాన్ని వారు గుర్తిస్తున్నారు. ఎందుకంటే కరోనా ట్రీట్మెంట్ బిల్లు చూస్తే వారికి వైద్యం ఎంత ఖరీదైన విషయమో అర్థం అవుతోంది. అయితే ఇలా వేగంగా ఆరోగ్య పాలసీలు తీసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు.

ALSO READ| Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

మెడికల్ ఎక్స్ క్లూజన్స్ పై ఫోకస్ పెట్టండి
హెల్త్ ఇన్సూరెన్స్ ( Health Insurance ) విషయానికి వస్తే మెడికల్ ఎక్స్ క్లూజన్స్ పై చాలా మంది ఫోకస్ పెట్టరు. ఇలా చేయడం వల్లా  ఇన్సూరెన్స్ సంస్థలు మీ క్లెయిమ్ ను నిరాకరించే అవకాశం ఉంది. అంటే పాలసీలో ఏం కవర్ అవుతుంది.. ఏం కవర్ కాదు అనేది తెలుసుకోవాలి. పాలసీ తీసుకోవానికి ముందు కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆనారోగ్యం గురించి పాలసీ తీసుకునే సమయంలో తెలియజేయాల్సి ఉంటుంది.

మెడికల్ హిస్టరీని దాచడం
ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనేది రూలేం కాదు. అయితే అప్పటికే ఉన్న అనారోగ్యం (Pre Existing Disease ) గురించి సంస్థకు తెలియజేస్తే వారు దాన్ని కవర్ చేసి .. ఎప్పటి నుంచి ఆ అనారోగ్యంపై వారు కవరేజ్ ఇస్తారో.. లేదా ఇవ్వరో.. ఇవ్వకపోతే ఎందుకో చెబుతారు. బీమా అనేది నమ్మకంతో కూడిన విషయం. అందుకే నిజాలు చెప్పాలి.

ALSO READ| Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా

హెల్త్ ఇన్సూరెన్స్  తీసుకునే ముందు క్యాష్ లెస్ ( Cashless ) సదుపాయం ఉందా లేదా అని అడిగి.. మీకు దగ్గరిలోని ఆసుపత్రులతో పాటు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా కోరండి.  క్యాష్ లెస్ పాలసీలో మీరు మీ జేబు నుంచి పైసా కూడా తీసే అవసరం ఉండదు. అందుకే ముందు పాలసీ తీసుకునే ముందు క్యాష్ లెస్ ఆసుపత్రులు జాబితాను చెక్ చేయండి. తరువాత పేమెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ అడగండి.

షరతులు, నిబంధనలు చదవండి
ఆరోగ్య బీమా తీసుకుంటున్న సమయంలో పాలసీ హోల్డర్స్ కు డాక్యుమెంట్స్ పై ఉన్న టెర్మ్స్ అండ్ కండీషన్స్ ముందు చదవాలి. ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రాసెస్ పూర్తి చేసే సమయంలో ఇవి చదవకపోతే తరువాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆసుపత్రిలో ఎలాంటి కవరేజ్ ఇస్తారు.. కోపేమెంట్, వెయిటింగ్ పిరియడ్, రూమ్ రెంట్.. ఇతర విషయాలపై క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ALSO READ| Tips To Use Sanitizer: శానిటైజర్‌ను ఎలా వాడాలో తెలుసా ?

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News