Teeth Care Remedies: మసాలా దినుసులను సాధారణంగా వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఆరోగ్యపరంగా వీటిలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేద వైద్య విధానంలో మసాలా దినుసుల వినియోగం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల మసాలా దినుసుల్ని పంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఉపయోగిస్తుంటారు. చిగుళ్లు, దంత సమస్యలను అద్భుతంగా తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, జీలకర్ర, వాము వంటి మసాలా దినుసుల ఉపయోగం మన దేశంలోనే ఎక్కువ. అదే సమయంలో ఆయుర్వేద వైద్య విధానంలో కూడా వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి కేవలం వంటల రుచి పెంచేందుకే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఈ మసాలా దినుసులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారిన దంత, చిగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఈ మసాలా దినుసులు ఉపయోగపడతాయి. వీటిలో ముఖ్యమైనవి పసుపు, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క. ఈ నాలుగు పంటి ఆరోగ్యానికి అద్బుతంగా ఉపయోగపడతాయి.
దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. దాల్చిన చెక్క పౌడర్‌ను తేనెతో కలిపి పంటిపై రాస్తే పళ్లు శుభ్రమౌతాయి. నోట్లో బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఇక మరో మసాలా పదార్ధం పసుపు. ఆయుర్వేదంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. ఇవి పండ్లు, చిగుళ్లను శుభ్రం చేస్తాయి. పసుపును మిశ్రమంగా చేసుకుని పండ్లకు రాయడం వల్ల పసుపురంగు పోవడమే కాకుండా చిగుళ్ల స్వెల్లింగ్ తగ్గుతుంది. ఇందులో కాస్త ఉప్పు కలిపితే టూత్ పేస్ట్‌లా కూడా వాడవచ్చు.
మరో అద్భుతమైన పదార్ధం ఇలాచీ. ఇది అద్భుతమైన మౌత్ ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఇలాచీ నమలడం వల్ల నోటి దుర్గంధం పోతుంది. పళ్లు శుభ్రమౌతాయి. క్రమం తప్పకుండా వాడితే చిగుళ్లు బలంగా ఉంటాయి. పళ్లు నిగనిగలాడుతాయి. ఇక లవంగం చివరిది అద్భుతమైంది. పంటి సంరక్షణలో లవంగం వినియోగం అనేది అనాదిగా వస్తున్నదే. ఇందులో ఉండే యుజెనాల్ అనే పోషకం పంటి నొప్పుులు, ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గిస్తుంది. లవంగం నూనెతో పళ్లను శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా పళ్లు స్ట్రాంగ్ అవుతాయి. రోజూ క్రమం తప్పకుండా వాడటం వల్ల పంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది. శ్వాసలో ఉండే దుర్గంధం కూడా పోతుంది. లవంగం నూనెను పళ్లకు రాసుకుని నెమ్మదిగా మాలిష్ చేస్తే మరింత మంచిది.
Also read: Spinach 10 Benefits: గుండె పోటు, డయాబెటిస్‌కు సైతం చెక్ పెట్టే అద్భుతమైన ఆకు కూర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.