Teeth Care Tips: పళ్లు ఆరోగ్యమే కాదు..అందానికి కూడా కారణమౌతుంటాయి. అందుకే పంటి సంరక్షణ చాలా అవసరం. పళ్లు బాగుండాలంటే..కొన్ని చెడు అలవాట్లు మానుకోవల్సిందే..
మనిషి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. సాధారణంగా చాలామంది అన్నీ పట్టించుకుని..కీలకమైన పళ్ల గురించి పట్టించుకోరు. పళ్లు శుభ్రంగా ఉంటే చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పంటి సంరక్షణంటే రోజుకు 2 సార్లు బ్రష్ చేస్తే సరిపోదంటున్నారు దంత వైద్య నిపుణులు. పళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏ పొరపాట్లు చేయకూడదు, ఎటువంటి చెడు అలవాట్లు మానేయాలో తెలుసుకుందాం..లేకపోతే కేవిటీ సమస్య తలెత్తుతుంది.
భారతీయులు ఎక్కువగా సేవించేది టీ. ఎంతెక్కువంటే బహుశా నీళ్ల తరువాత ఎక్కువగా టీనే తాగుతారేమో. ఉదయం లేచినప్పట్నించి రాత్రి పడుకునేవరకూ టీ తాగడమంటే చాలా ఇష్టపడతారు. అయితే పంటి సంరక్షణ కోసం ఈ అలవాటు మానుకోవల్సిందే. ఎందుకంటే టీ అనేది పళ్ల బయటి పొరను దెబ్బతీస్తుందని అంటున్నారు దంత వైద్య నిపుణులు. ఫలితంగా పళ్లు బలహీనమవడమే కాకుండా..పసుపుగా మారిపోతాయి.
అయిష్టంగానైనా సరే తీపి పదార్ధాల్ని సాధ్యమైనంతవరకూ తగ్గించేయాలి. ముఖ్యంగా క్యాండీస్ పూర్తిగా మానేయాలి. ఇవి పళ్లను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇవి పళ్ల రంగును వెలిసేలా చేస్తాయి. మార్కెట్‌లో లభించే చాలా రకాల పేస్ట్‌లు కూడా మీ పళ్ల రంగును వెలిసేలా చేస్తుంటాయి. పేస్టుల్లో ఉండే కెమికల్స్ కారణంగా పళ్లు రంగు మారిపోతుంటాయి. అందుకే వైద్యులు సూచించిన పేస్టులు వాడటమే మంచిది.
ఇటీవలి కాలంలో ఎనర్జీ డ్రింకుల వినియోగం ఎక్కువైంది. మార్కెట్‌లో చాలా రకాల ఎనర్జీ డ్రింక్స్ లభిస్తున్నాయి. పంటి సంరక్షణకు వీటికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఎనర్జీ డ్రింకుల వల్ల పళ్ల బయటి పొర దెబ్బతింటుంది. ఫలితంగా సెన్సిటివిటీ పెరిగిపోతుంది.
Also read: Peanut Butter: పీనట్ బటర్ ఎప్పుడైనా తిన్నారా..ఆ 4 ప్రయోజనాలు తెలిస్తే ఇక వదిలిపెట్టరు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook