Increase HDL Levels: మన శరీరంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఆరోగ్యకరం కాదు.ఇది గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. మనం ఎప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) నియంత్రించుకుంటూ ఉండాలి. లేదంటే ఇది అర్టెరీ బ్లాకేజీలకు దారితీస్తుంది. దీంతో స్ట్రోక్, గుండె సమస్యలకు కారణమవుతుంది.
మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు (HDL) పెంచితే గుండె సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటు ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇది మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు శరీర శక్తి కోసం వినియోగించబడుతుంది. ఇది ఎక్కువగా మారి తక్కువ మంచి కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు లేదా ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ కలిసినప్పుడు ప్రమాదం మరింత పెరిగి హార్ట్ అటాక్‌కు దారి తీస్తుందని సీడీసీ రిపోర్ట్ తెలిపింది.
అయితే, కొన్ని రకాల కూరగాయలు, పండ్లు డైట్లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించుకోవచ్చు.
పాలకూర..
పాలకూరలో లుటీన్, కెరొటనాయిడ్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. పాలకూరను సలాడ్, స్మూథీస్‌తోపాటు సైడ్ డిష్ మాదిరి కూడా తీసుకోవచ్చు.
కాలే..
కాలేలో పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ముఖ్యంగా మన శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 2016 నివేదిక ప్రకారం కాలే ప్రతిరోజూ తిన్నవారిలో కేవలం ఎనిమిది వారాల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. దీన్ని కూడా సలాడ్, సూప్స్ లేదా ఆరోగ్యకరమైన కాలే చిప్స్ కూడా తయారు చేసుకోవచ్చు.
బ్రొకోలీ..
బ్రొకోలిలో కూడా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి. క్రూసీఫెరస్ జాతికి చెందిన బ్రోకోలీని ఫ్రై, రోస్ట్ మాదిరి తయారు చేసుకొని మీ డైట్లో చేర్చుకోవాలి.
క్యారట్లు..
క్యారట్‌లో ముఖ్యంగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇందులోని పెక్టిన్ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. క్యారట్‌ను పచ్చిగా కూడా తినవచ్చు. లేదా స్నార్ , సూప్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన కూరగాయ.
ఇదీ చదవండి: ఈ మాస్క్ వేస్తే పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు కూడా రాలిపోవాల్సిందే..
చిలగడదుంప...
చిలగడదుంపలో ఫైబ్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తుంది. చిలగడదుంపను బేక్ చేయవచ్చు. లేదా రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు దీన్ని స్ట్యూ, సూప్ లా కూడా తీసుకుంటారు.
క్యాబేజీ..
ఫైబర్ అధికంగా ఉండే ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని కూడా సలాడ్ రూపంలో కానీ వివిధ వంటల్లో కానీ ఉపయోగించవచ్చు.
ఇదీ చదవండి: ఎవరీ సుల్తాన్? 7000 పైగా కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్ ఉన్న కింగ్.. నేడు మోదీకి ఆతిథ్యం..
కాకరకాయ..
కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండె పనితీరును మెరుగు చేస్తుంది. కాకరకాయ జ్యూస్, కూర రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ కూరగాయ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ కూరగాయలతో మీకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉండవు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter