Spinach 10 Benefits in Telugu: హెల్తీ ఫుడ్స్‌లో భాగంగా పాలకూర వంటి ఆకుకూరల్ని రోజువారీ డైట్లో తప్పకుండా చేర్చాలి. ఎందుకంటే పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలకూరతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. రోజూ కాకపోయినా వారంలో కనీసం 3-4 సార్లు తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. సులభంగా చెప్పాలంటే పాలకూర అనేది పోషక విలువల ఖజానా.
సాధారణంగా మెరుగైన ఆరోగ్యం కోసం ఆకు కూరలు అధికంగా తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఈ ఆకుకూరల్లో బెస్ట్ అంటే పాలకూర అని చెప్పాలి. రుచితో పాటు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే శరీరాన్ని చాలా రకాల వ్యాధుల్నించి రక్షిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా పాలకూర అనేది బెస్ట్ డీటాక్సిఫయర్ అని చెప్పాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కీటాణువుల్ని నష్టపరుస్తాయి. విష పదార్ధాలను బయటకు తొలగించడంలో దోహదం చేస్తాయి. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రేవుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ప్రేవులు క్లీన్ అవుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.
పాలకూర డయాబెటిస్ రోగులకు చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. తక్కువ అన్నంతో ఎక్కువ పాలకూర తినాలి. వారంలో కనీసం 3-4 సార్లు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్బుతంగా నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఇన్సులిన్ ఉత్పాదకతను పెంచుతుంది. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పాలకూరలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ వంటి ముఫ్పు తగ్గుతుంది. పాలకూరను క్రమం తప్పకుండా తినడం వల్ల ఇందులో ఉండే ఫోలేట్ కారణంగా ఆందోళన, ఒత్తిడి వంటివి దూరమై మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
పాలకూరలో ఫైబర్, ఐరన్, విటమిన్లు, పెద్దమొత్తంలో ఉండటం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. దాంతో అలసట దూరమౌతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలు అద్భుతంగా పనిచేస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియ ఫాలో అవుతున్నప్పుడు పాలకూరను డైట్లో చేర్చాలి. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ కే, ల్యూటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.
పాలకూరలో విటమిన్ కే, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల్ని పటిష్టం చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో కనీసం 3 సార్లు పాలకూర తినాలి. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి నిగారింపును ఇస్తుంది.
Also read: Telangana Heavy Rains: హైదరాబాద్ సహా 12 జిల్లాలకు బిగ్ అలర్ట్, 3 రోజుల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.