Anti Ageing Serum: ఈ సీరమ్ రోజూ రాస్తే చాలు 3 వారాల్లో ముడతలు, పింపుల్స్ దూరం, నిత్య యౌవనం మీ సొంతం

Anti Ageing Serum: అందం సగం ఆరోగ్యమంటారు. అందాన్ని కాపాడుకోవడం, ఏజీయింగ్ బయటపడటం అంత సులభమేం కాదు. వయస్సు పెరిగే కొద్దీ మరింత అధికమౌతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, చిట్కాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2023, 11:26 PM IST
Anti Ageing Serum: ఈ సీరమ్ రోజూ రాస్తే చాలు 3 వారాల్లో ముడతలు, పింపుల్స్ దూరం, నిత్య యౌవనం మీ సొంతం

Anti Ageing Serum: వయసు పెరిగే కొద్దీ ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. పింపుల్స్, ముడతలు, చారలు పడుతుంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వయస్సు మీదపడినా వృద్ధాప్యం దరిచేరకుండా నిత్య యౌవనంగా ఉండవచ్చంటున్నారు. అంటే ఏజీయింగ్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యం కూడా కాపాడుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్మం సంరక్షణ చాలా అవసరం. ప్రకృతిలో లభించే పదార్ధాలు లేదా వస్తువులతో సహజిసిద్ధంగా ఏజీయింగ్ సమస్యను దూరం చేయవచ్చు. దీనికోసం అల్లోవెరాతో యంటీ ఏజీయింగ్ ఫేస్ సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అల్లోవెరా, బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్లోవెరా అనేది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో దోహదపడుతుంది. అల్లోవెరాలో యాంటీ ఏజీయింగ్ గుణాలు చాలా ఎక్కువ. పెరుగుతున్న వయస్సుతో పాటు కన్పించే లక్షణాల్ని ఇవి దూరం చేస్తాయి.

అల్లోవెరాతో ఫేస్ సీరమ్ తయారు చేసేందుకు అల్లోవెరా జెల్ 4 చెంచాలు, విటమిన్ ఇ క్యాప్సూల్స్ 3, రోజ్ వాటర్ 2 చెంచాలు, గ్లిసరిన్ ఒక చెంచా, ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా అవసరం. అల్లోవెరా ఫేస్ సీరమ్ తయారు చేసేందుకు ముందుగా చిన్న గిన్నె తీసుకోవాలి. ఇందులో 4 చెంచాల అల్లోవెరా జెల్, 2 చెంచాల రోజ్ వాటర్, 1 చెంచా గ్లిసరిన్ వేయాలి. ఆ తరువాత ఇందులో విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేయాలి. ఇందులో కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపవచ్చు. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే మీక్కావల్సిన అల్లోవెరా ఫేస్ సీరమ్ తయారైనట్టే.

అల్లోవెరా ఫేస్ సీరమ్ ముఖానికి రాసేముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత రోజూ ఉదయం సాయంత్రం ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే 3-4 వారాల్లో ముఖంపై ముడతలు, చారలు వంటివి తొలగిపోతాయి. 

Also read: High Blood Pressure Control: ఈ రెండు ప్రాణాయామాలతో High BPకి శాశ్వతంగా చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News