Exercise to Loss Belly Fat in 8 Days: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు దానిని తగ్గించుకోవడానికి ప్రతి రోజూ డైట్‌లో ప్రకారం ఆహారాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ శరీర బరువు, చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి విముక్తి పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేస్తూ యోగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా శరీర బరువు తగ్గి, పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి రోజూ వర్కవుట్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి తప్పకుండా చేయాల్సిన వ్యాయామాలు:
ఫ్లట్టర్ కిక్స్:
బొడ్డు కొవ్వును తగ్గించడానికి ఫ్లట్టర్ కిక్స్ ఉత్తమైన వర్కవుట్ అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని ప్రతి రోజూ చేయడం వల్ల దిగువ కండరాలను బలంగా చేస్తుంది. దీని కోసం మీరు ముందుగా మీరు చాప మీద పడుకోండి. ఇప్పుడు చేతులను మీ తుంటి కింద ఉంచి..వెనుకకు నేలపై కుడి కాలును పైకి లేపండి. నేల నుంచి కొన్ని అంగుళాల దూరంలో ఉండేలా ఎడమ కాలును కూడా ఎత్తండి. ఇలా 5 సెకన్ల పాటు ఉండండి. అంతే ఇలా ప్రతి రోజు 10 నిమిషాల పాటు చేస్తే అనారోగ్య సమస్యలతో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
డౌన్ ప్లాంక్:
ఈ వర్కవుట్ చేయడానికి ముందుగా మణికట్టును భుజాల కింద, కాళ్లను దూరంగా ఉంచాలి. ఎడమ చేతిని మడిచి, ఎడమ మోచేయిని చాపపై ఉంచండి. ఇప్పుడు కుడి చేతిని మడిచి, మీ కుడి మోచేయిని చాపపై ఉంచండి. ఇలా 5 సెకన్ల పాటు ఉంచితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా భుజాలు కూడా దృఢంగా మారుతాయి. దీనిని ప్రతి రోజూ చేయడం వల్ల పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!
Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook