Stomach Ache During Nights: మన శరీరంలో ఏ భాగంలో నొప్పి వచ్చినా సరే భరించడం అసాధ్యం.. ముఖ్యంగా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది..? ఈ కడుపు నొప్పి ఎప్పుడు ? ఏ కారణాల వల్ల ఇబ్బంది పెడుతుందో? కూడా చెప్పలేని పరిస్థితి.. అయితే ఈ కడుపునొప్పి డే టైం లో వస్తే ఏదో ఒక ప్రయత్నం చేయవచ్చు.. కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అర్థరాత్రి కడుపునొప్పి వస్తే మాత్రం ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలా అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపునొప్పి ఎందుకు వస్తుంది? ఇలా రావడం వల్ల ఏదైనా ప్రమాదమా..? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? అనే విషయాలు బాధితులను మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి అనుకోకుండా అర్థరాత్రిలు మీరు హఠాత్తుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా కడుపునొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా పెప్టిక్ అల్సర్ కారణంగా పొత్తికడుపు పైభాగంలో ఉంటుంది. ఈ నొప్పి కడుపు పై భాగం నుండి మధ్య వరకు వస్తుంది. కడుపు ఎడమ వైపు నొప్పి వస్తే అది ప్యాంక్రియాస్ సమస్య కావచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది కూడా. ఒకవేళ కుడి వైపున కడుపునొప్పి వస్తే పిత్తాశయంలో రాళ్లు లేదా వాపు కారణంగా ఈ నొప్పి వస్తుంది. ఇలా మీకు ఎప్పుడైనా అకస్మాత్తుగా కడుపునొప్పి వస్తే కొన్ని ఇంటి నివారణలతో మీరు నొప్పిని వదిలించుకోవచ్చు. పూర్తిగా కాకపోయినా కనీసం కొద్దిగా మీకు ఉపశమనం కలుగుతుంది.
గ్యాస్ నొప్పి ఉంటే గ్యాస్ మందు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది లేదా కొంచెం వేడి నీళ్లు తాగినా సరే అప్పటికప్పుడు కాస్త ఉపశమనం కలుగుతుంది.
ఇక అర్ధరాత్రిళ్లు ఊహించని విధంగా కడుపునొప్పి వచ్చి .. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే సమయానికి మందులు లేకుంటే టవల్ ను వేడి నీటిలో తడిపి పొట్ట పైన వేసి ఉంచాలి. ఇలా చేస్తే సౌకర్యంగా , హాయిగా ఉంటుంది. నొప్పి నుంచి కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది.
అలాగే వాము.. ఒక టేబుల్ స్పూన్ తీసుకొని నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్, కడుపునొప్పి సమస్యలు దూరం అవుతాయి. లేదంటే మీరు మార్కెట్లో దొరికే వాము వాటర్ ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వాము వాటర్ తాగినా సరే కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం
Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి