PCOD: ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల కారణంగా.. ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అతి చిన్న వయసులోనే మెచ్యూరి అవుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే ఇదిలా ఉండగా మరొకవైపు 15 నుండి 25 సంవత్సరాల లోపు యువతులు అధికంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అసాధారణంగా ఆండ్రోజన్ లను ఉత్పత్తి చేసే పరిస్థితి.. ఇది అండాశయ తిత్తులు ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ స్థితిలో స్థూలఖాయం, పీరియడ్స్ సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా చాలా సందర్భాలలో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పీసీఓడీ వస్తుంది.
అల్ట్రా సౌండ్ స్కానింగ్ లేకుండానే..
దీని ఫలితంగా ముఖంపై మొటిమలు, వెంట్రుకలు పెరగడం, మూడ్ స్వింగ్స్ కూడా ఏర్పడతాయి. ఇక చాలామంది మహిళలు తమకు అండాశయ తిత్తులు ఏర్పడుతున్నాయని.. ప్రాథమిక దశలోనే గుర్తించకపోవడం వల్ల పరిస్థితి.. మరింత తీవ్రతరం అవుతుంది. అందుకే పిసిఒడిని ప్రారంభ దిశలో నిర్ధారించడం కష్టం. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక దశలోనే గుర్తించడం అంటే అది అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్లే సాధ్యం అవుతుంది ...కానీ అలాంటి స్కానింగ్ చెయ్యకుండానే కొన్ని లక్షణాలు గుర్తిస్తే.. పిసిఒడిని గుర్తించవచ్చు.
PCOD ప్రాథమిక లక్షణాలు..
పి సి ఓ డి/ పి సి ఓ ఎస్ సమస్యలతో బాధపడే వారి శరీరంలో కార్టిసాల్ ఏర్పడుతుంది.ఇది శరీరాన్ని బలహీన పరుస్తుంది. పి సి ఓ డీ సమస్య కారణంగా తీవ్రమైన జుట్టు నష్టం, షాంపూ, నూనె ఎన్ని వాడినా జుట్టు రాలడం ఆగదు.. అలాగే క్రమ రహిత ఋతుస్రావం, పీరియడ్ సమయంలో దిగువ పొత్తికడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి మీరు పిసిఒడి సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చక్కర స్థాయిలు కార్టిసాల్ హెచ్చుతగ్గులకు గురవుతాయి. పి సి ఓ డీ శరీరంలో.. ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కు కూడా కారణమవుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగి తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. ఈ లక్షణాలు గనుక మీలో ఉన్నట్లయితే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించాలి.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. సమస్య ఎక్కువైతే వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టడంలో కూడా ఆలస్యం అవుతుంది.. ఇప్పటికే 10 లో 6 మంది ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..
Also Read: డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి