కరోనా మహమ్మారి వరుసగా మూడో ఏడాది కూడా వెంటాడుతోంది. కరోనా కారణంగా చాలా మంది మృత్యువాత పడ్డారు. చాలా కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 భయం పట్టుకుంది. చైనా సహా పలు దేశాల్లో ఇదే వేరియంట్ వెంటాడుతోంది. ఈ వ్యాధి సోకిందా లేదా అనేది ఎలా గుర్తించడం..
లక్షణాల్లో సారూప్యత
ఇండియాలో ఒమిక్రాన్ బీఎఫ్.7 సంక్రమణ ఇండియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో చలికాలం సమయం కావడంతో చాలామందికి సాధారణ ఫ్లూ లేదా కరోనా వైరస్ సోకిందా అనేది తెలుసుకోలేక ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఈ రెండింటి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. బీఎఫ్.7 అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్. వీటి లక్షణాలు కూడా ఒమిక్రాన్ లక్షణాల్లానే జలుబు, దగ్గు, ముక్కు కారడం, జ్వరం, గొంతులో గరగర ఉంటాయి. అదే విధంగా చలికాలంలో కన్పించే లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జలుబు, దగ్గు వంటి లక్షణాలు చలికారణంగా వచ్చాయా లేదా ఒమిక్రాన్ కారణంగా అనేది తెలుసుకోవడం కష్టమౌతుంటుంది.
జలుబా లేదా కోవిడ్‌నా, ఎలా గుర్తించడం
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ ప్రకారం..జలుబు లేదా కోవిడ్ మధ్య ఉండే తేడాను గురించి వైద్యులు సూచనలు అందించారు. ఇండియాలో ఈ వేరియంట్ 2022 ఆగస్టు నుంచే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించేది అయినా..ఇండియా ఆరోగ్య వ్యవస్థపై పెద్దగా ప్రభావం పడటం లేదు. అందుకే ఈ వేరియంట్ సోకినా పరిస్థితి విషమం కావడం లేదు.
ఒమిక్రాన్ బీఎఫ్.7 లక్షణాలు
ఈ వేరియంట్ లక్షణాల గురించి పరిశీలిస్తే..గొంతు పాడవడం, జ్వరం, ముక్కు కారడం, దగ్గు, అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, శ్వాస కష్టంగా ఉండటం ఉంటుంది. వైద్యులు చెప్పినదాని ప్రకారం...ఒకవేళ జ్వరం, దగ్గు వంటి లక్షణాలు 5 రోజుల తరువాత కూడా తగ్గకపోతే..కోవిడ్ పరీక్ష చేయించుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షణాలు సాధారణ జలుబు లక్షణాల్లానే అయోమయానికి గురి చేస్తాయి.
Also read: Health Tips: మలబద్ధకం, అజీర్తి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook