Monsoon Diseases: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతుంటుంది. ముఖ్యంగా చలి, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. అసలు వర్షాకాలంలో ఏయే వ్యాధులు పొంచి ఉన్నాయి..ఎలా రక్షించుకోవాలో చూద్దాం..
వర్షాకాలం ఆనందంతో పాటు కష్టాలు కూడా తెస్తుంది. ఎందుకంటే ఎండాకాలం, చలికాలంతో పోలిస్తే వర్షాకాలంలో వ్యాధుల బెడద చాలా ఎక్కువ. ఎక్కువగా చలి, జలుబు, జ్వరం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. దాంతోపాటు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు కూడా పొంచి ఉంటాయి. అందుకే వర్షాకాలంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో వచ్చే వ్యాధులేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
కడుపులో ఇన్‌ఫెక్షన్, డయేరియా
వర్షకాలంలో తరచూ కడుపులో ఇన్‌ఫెక్షన్ సమస్య తలెత్తుతుంటుంది. ఇదంతా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల సంభవిస్తుంది. గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనేది వర్షాకాలంలో ఎదురయ్యే కడుపుకు సంబంధించిన సాధారణ వ్యాధి. దీనివల్ల జ్వరం, వాంతులు, కడుపులో పట్టేయడం, విరేచనాలు, కడుపు నొప్పి, ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఉంటాయి. ఇక మరో ప్రధాన సమస్య డయేరియా. అంటే విరేచనాలు. వర్షాకాలంలో తరచూ కన్పించే సమస్య ఇదే. ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. కడుపు వికారం, జ్వరం, వాపు, విరేచనాలు వంటి లక్షణాలుంటాయి.
ఇక వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కన్పిస్తుంటాయి. ఇతర సీజన్లలో కూడా వైరల్ ఫీవర్లు ఉన్నా..వర్షాకాలంలో మరింత ఎక్కువగా ఉంటాయి. జ్వరం, అలసట, తల తిరగడం, బలహీనత, చలి, జాయింట్ పెయిన్స్ వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. మరో ప్రధానమైన వ్యాధి మలేరియా. ఇది సర్వ సాధారణమే అయినా నిర్లక్ష్యం వహిస్తే అత్యంత ప్రమాదకరం. మలేరియా దోమకాటు ద్వారా వస్తుంది. ఇది తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయి. మలేరియా సోకినప్పుడు ఒంటి నొప్పులు, తీవ్రమైన జ్వరం, చెమట్లు పట్టడం, రక్త హీనత వంటి లక్షణాలుంటాయి.
వర్షాకాలం సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకునే మార్గాలు
1. వర్షాకాలం వ్యాధుల్నించి కాపాడుకునేందుకు ముందుగా తీసుకునే ఆహారంపై జాగ్రత్తతో పాటు దృష్టి వహించాలి
2. మసాలా, డీప్ ఫ్రై, ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి
3. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి
4. ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. బయటి తిండిని పూర్తిగా దూరం పెట్టాలి
5. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రైట్‌గా ఉంచేందుకు ఎక్కువ నీళ్లు తాగాలి
Also read: Heart Attack Symptoms: గుండె ఆరోగ్యానికి ఏం చేయాలి, గుండెపోటు లక్షణాలేవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.