Allu Arjun: బన్నీ బాబుకు బై బై చెప్పేస్తున్న మెగా హీరోలు.. చిచ్చు పెట్టిన ఆ ఒక్క తప్పు..

Allu Arjun vs Mega Hereos: మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం మీద గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం ఇరు కుటుంబాల మధ్య చిచ్చు బాగా ముదిరిపోయినట్టు తెలుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు మెగా హీరోలు అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో దండయాత్ర చేస్తున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 12, 2024, 05:07 PM IST
Allu Arjun: బన్నీ బాబుకు బై బై చెప్పేస్తున్న మెగా హీరోలు.. చిచ్చు పెట్టిన ఆ ఒక్క తప్పు..

Allu Arjun-Mega Family Controversy: మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో.. ఇప్పటికే చాలామంది హీరోలు.. మెగా కుటుంబం నుంచి.. అల్లు కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి.. తమకంటూ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. కూడా తనను తాను మెగా హీరో లాగానే.. పరిచయం చేసుకునేవారు. 

దాదాపు ప్రతి ఈవెంట్ లో మెగాస్టార్ గురించి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. చాలా గొప్పగా మాట్లాడుతుండే వాళ్ళు. కానీ తనకంటూ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత.. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ గురించి పక్కన పెట్టేసి.. అల్లు కుటుంబం గురించి మాత్రమే.. మాట్లాడటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఒక ఈ వంతులో పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు..’ చెప్పను బ్రదర్ ‘..అంటూ కొట్టి పాడేసారు. 

దీంతో అల్లు కుటుంబం.. మెగా కుటుంబం మధ్య గొడవలు జరుగుతున్నాయి అని వార్తలు వినిపించసాగాయి. అప్పటి నుంచి ఏదో ఒక కారణంగా.. ఈ ఇరు కుటుంబాలు.. వార్తలు నిలుస్తూనే వచ్చాయి. ఇక ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి.. ఇరు కుటుంబాల మధ్య గొడవలు..మరీ ముదిరిపోయినట్లు కనిపిస్తున్నాయి. 

పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి.. కేవలం సోషల్ మీడియాలో.. ఒక చిన్న ట్వీట్ తో సపోర్ట్ చేసిన అల్లు అర్జున్.. వైసీపీ నుంచి నంద్యాలలో పోటీ చేసిన శిల్ప రవి కోసం మాత్రం.. నంద్యాల వెళ్లి మరి ప్రమోట్ చేశారు. ఈ సమయంలో దీంతో పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు వెన్నంటే ఉండే నాగబాబు బాగా హర్ట్ అయ్యి.. ట్విట్టర్ లో ఇండైరెక్టుగా బన్నీ పై తెగ ఫైర్ అయ్యారు. 

మనకి సపోర్ట్ చేయని వారు మనవారైనా పరాయి వాళ్లే.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికలు పూర్తయి.. పవన్ కళ్యాణ్.. భారీ విజయంతో.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎంపికైనప్పుడు..కూడా బన్నీ కేవలం ఒక చిన్న ట్వీట్ తో శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబం.. పవన్ కళ్యాణ్ ని సాదరంగా ఆహ్వానించి పెద్ద పార్టీ ఇచ్చినప్పుడు.. అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఇందులో కనిపించలేదు. 

తాజాగా ఇప్పుడు మరొక మెగా హీరో.. అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్ట్ గా ఎటాక్ చేశారు. తనే సాయి ధరంతేజ్. తాజా సమాచారం ప్రకారం సాయి ధరంతేజ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి అల్లు అర్జున్ ని ఫాలో అవడం ఆపేసారు. సొంత కుటుంబ సభ్యులు అయ్యుండి కూడా.. తేజ్.. బన్నీ సోషల్ మీడియాని అన్ ఫాలో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

దీంతో మెగా కుటుంబం నుంచి ఒకరి తర్వాత.. మరొక హీరో బన్నీకి బై బై చెబుతున్నట్లు.. కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ ఈ విషయం మీద మాట్లాడతారో లేదో చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News