Lemon Water: బరువు తగ్గడానికి అతిగా నిమ్మ రసం తాగితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Lemon Water In Morning: నిమ్మ రసంతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే.. వేడి నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని, టీగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలను దూరమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 12:24 PM IST
  • బరువు తగ్గడానికి అతిగా నిమ్మ రసం తాగితే..
  • కడుపులో నొప్పి వచ్చే అవకాశాలున్నాయి.
  • కావున అతిగా తీసుకోవద్దు
Lemon Water: బరువు తగ్గడానికి అతిగా నిమ్మ రసం తాగితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Lemon Water In Morning: నిమ్మ రసంతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే.. వేడి నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని, టీగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలను దూరమవుతాయి. అంతేకాకుండా పెరుగుతున్న బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది. నిమ్మరసంలో ఉండే పోషకాలు.. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాయి. అందుకే జీర్ణ క్రియ సమస్యలు ఉంటే నిమ్మరసం తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే ప్రస్తుతం చాలామంది నిమ్మ రసాన్ని అతిగా వినియోగిస్తున్నారు. దీనిని అతిగా వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని అతిగా వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అవయవాలు దెబ్బ తినే అవకాశాలు:
నిమ్మరసంలో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటుంది. కావున దీనిని అతిగా వినియోగించడం వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి దీనిని తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అతిగా నిమ్మరసం వినియోగించడం వల్ల ఉత్పన్నమయ్య సమస్యలు ఇవే:

1. కడుపు నొప్పి, మంటలు:
విటమిన్ సిని ఇక పరిమాణంలో తీసుకుంటే.. శరీరంలో ఆమ్ల పరిమాణం పెరిగే అవకాశాలున్నాయి. ఎసిడిటీ సమస్యలు, కడుపునొప్పి, మంటల సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా కొందరిలో వాంతులు, విరేచనాలకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. నిమ్మ రసాన్ని ఎంత మోతాదులో వినియోగించాలో అంతే మోతాదులో వినియోగిస్తే చాలా మంచిది.

2. నోటి పూతలు:
నిమ్మరసాన్ని అధికంగా వినియోగించడం వల్ల నోటి నుంచి దుర్వాసన, దంతాల సమస్యల బారినపడుతున్నారని ఇటీవల నివేదికలు తెలిపాయి. ఇందులో అధిక మోతాదులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కావున ఈ రసాన్ని రోజు తాగితే నోటిలోని కణజాలం దెబ్బ తినే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కణజాలాల్లో వాపులు రావడం.. నోటిలో పొక్కులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఇంతకు ముందే ఇలాంటి సమస్యలు ఉంటే నిమ్మ రసాన్ని తీసుకోకపోవడం మంచిది.

3. దంతాలు బలహీనంగా మారే అవకాశాలు:
నిమ్మరసాన్ని ఉప్పు, చక్కెరతో క్రమం తప్పకుండా తాగితే.. దంతాలు బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు . కావున దంతాల సమస్యలతో బాధపడేవారు.. నిమ్మరసాన్ని తాగకపోవడం చాలా మంచిది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News