Cholesterol Warning Signs: చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంటుంది. ఫలితంగా బ్లాకేజ్ ముప్పు పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ సకాలంలో నిమంత్రించకుంటే హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక పరిస్థితి ఎదురౌతుంది. అందుకే సకాలంలో వైద్యుని సంప్రదించడంతో పాటు హెల్తీ లైఫ్‌స్టైల్, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
లక్షణాలు కన్పించకపోయినా కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీనికోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. 45 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ ప్రతి ఐదేళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలి. 45 ఏళ్లు దాటిన తరువాత ప్రతి రెండేళ్లకోసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్షించుకోవాలి.లిపిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ శరీరంలో దిగువన పేర్కొన్న 6 లక్షణాలు కన్పిస్తే
వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
శరీరంలో కన్పించే కొలెస్ట్రాల్ లక్షణాలు
కళ్లపై పసుపు మచ్చలున్నాయంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉన్నట్టు అర్ధం. కంటిపై పసుపు రంగులో కొవ్వు పేరుకుని కన్పిస్తుంది. ఇక రెండవది కాళ్లలో నొప్పులు కన్పిస్తాయి. తరచూ అదే పనిగా కాలి మడమల్లో తీవ్రమైన నొప్పి కల్పిస్తుంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉందని అర్ధం చేసుకోవాలి. కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది కానీ తిరిగి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే వైద్యుని సంప్రదించాలి.
ఇక మరో లక్షణం నడుస్తున్నప్పుడు తడబడటం. నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోయినట్టుంటుంది.శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇలానే ఉంటుంది. చాలామంది ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. నాలుగో లక్షణం చర్మంపై దద్దుర్లు లేదా పొక్కు రావడం. కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఈ పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి కీళ్లు, మోకాళ్లు, జాయింట్స్ లో కన్పిస్తాయి. ఇక ఐదవ లక్షణం ఛాతీలో నొప్పి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఛాతీలో నొప్పి ఉంటుంది. కానీ ఛాతీ నొప్పి తరచూ వస్తుంటే మాత్రం గుండెలో ఏదో సమస్య ఉందని అర్ధం.
ఇక ఆరవ లక్షణం కళ్లలో తెలుపు చారలు రావడం. కంటి చుట్టూ లేదా కంట్లో తెలుపు చారలు కన్పిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఈ పరిస్థితి ఉంటుంది.
Also read: Vitamin B12 Rich Foods: విటమిన్ బి12 కొరత ఉందా, ఈ 5 ఫుడ్స్ తీసుకుంటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి