Horsegram Benefits: కోస్తాంధ్ర ప్రాంతంలోని కొన్ని హోటళ్ల ముందు చూస్తుంటాం కదా. ఉలవ చారు స్పెషల్ అని. రుచి అదుర్స్ కాబట్టే అలా ప్రత్యేకమని బోర్డులు దర్శనమిస్తుంటాయి. మరి అదే ఉలవలతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఉలవలు. ఇవో రకం పప్పు దినుసులు. కోస్తాంధ్రలో చాలా హోటళ్లు..ఇవాళ్టి స్పెషల్ ఉలవచారు అని బోర్డులు పెడుతుంటాయి. దీనికి కారణం ఆ రుచి అంత అద్భుతంగా ఉండటమే. ఇవే ఉలవలతో కలిగే ఆరోగ్యపర ప్రయోజనాలు చూస్తే..ఇక వదిలిపెట్టరు వాటిని. వాస్తవానికి మాంసం కంటే ఉలవల్లోనే ఎక్కువ పోషక పదార్ధాలుంటాయి. అందుకే శాకాహారులకు ఇదొక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. పౌష్టికాహార జాబితాలో ఉన్న పప్పు దినుసుల్లో ఉలవలు మొదటి స్థానంలోనే ఉంటాయి. చాలా రకాల రోగాలకు ఉలవలు సమాధానమిస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
మూత్ర పిండాల్లో (Kidney) రాళ్ల సమస్య ఉన్నవారికి ఉలవలు (Horsegram Benefits) మంచి ప్రత్యామ్నాయం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే..కిడ్నీలోని రాళ్లను పగలగొడతాయి. బయటకు మలినాల రూపంలో విసర్జితమౌతాయి. ఇక మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఉలవలు చాలా లాభం చేకూరుస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో, తగ్గించడంలో ఉలవలకు మించిన పప్పుదినుసు మరొకటి లేదు. ఇక సంతాన సాఫల్యతకు కూడా ఉలవలు దోహదపడతాయి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి..సంతానోత్పత్తి సమస్యలుండే పురుషులకు ఈ పప్పు చాలా ఉపయోగపడుతుంది. వైద్య నిపుణుల సలహాతో తీసుకోవల్సి ఉంటుంది.
ఇక బలహీనతను దూరం చేసేందుకు ఉలవలు బాగా ఉపయోగపడుతాయి. ఉలవల్లో పుష్కలంగా లభించే ఫాస్పరస్, కాల్షియం, ప్రోటీన్ , ఐరన్ కారణంగా బలహీనత దూరమవుతుంది. చిన్న పనిచేసినా అలసటగా ఉన్నా..లేదా రక్తం లేనివారు ఉలవల్ని రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇక బరువు తగ్గేందుకు ఉలవలు చాలా బాగా దోహదపడుతాయి. ఉలవల్లో కార్పోహైడ్రేట్లు (Corbohydrates) తక్కువగా ఉండి..ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడో ఓసారి కాకుండా క్రమం తప్పకుండా తీసుకోవాలి.
Also read: Winter Health Tips: చలికాలంలో పాటించాల్సి ఐదు ఆరోగ్య సూత్రాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook