Kidney Cleanse foods: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు..  పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..

Kidney Cleanse foods: మన శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం నుంచి విష పదార్థాలు మూత్రం ద్వారా కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఎళ్లవేళలా కాపాడుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : May 25, 2024, 09:27 AM IST
Kidney Cleanse foods: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు..  పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..

Kidney Cleanse foods: మన శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం నుంచి విష పదార్థాలు మూత్రం ద్వారా కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఎళ్లవేళలా కాపాడుకోవాలి. ఎందుకంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది. లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రాణాంతక పరిస్థితి కి దారి తీస్తుంది. అయితే కిడ్నీలు క్లీన్‌ చేసే ఫుడ్స్ ఉంటాయి. దీంతో కిడ్నీలు పాడవకుండా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

నీరు..
నీళ్లు మనకు రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. అందుకే నీరు ఎక్కువ తాగాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తారు. అంతేకాదు కిడ్నీలు హెల్తీగా ఉండడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నీళ్లు మన శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపించడంలో కిడ్నీలకు తోడ్పడుతుంది. దీంతో కిడ్నీ స్టోన్ సమస్యలు రావు.

 నిమ్మ..
నిమ్మ కిడ్నీలను మంచి డిటాక్సిఫైయింగ్ చేసే గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపియటంలో మెరుగ్గా పనిచేస్తాయి. సిట్రస్‌ ఉండే ఆహారాలు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ నివారిస్తాయి. రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి.

క్రాన్ బెర్రీస్..
క్రాన్ బెర్రీస్ లో యాంటి ఆక్సిడెంట్లు పేరంథోసైన్‌ డైన్స్ ఉంటాయి. ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా షీల్డ్ లాగా మన కిడ్నీలను కాపాడతాయి. బ్యాక్టీరియా సమస్య పెరగకుండా నివారిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌ ఇది చక్కనైన రెమెడీ.

ఆకుకూరలు..
ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలే, పాలకూర కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇవి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా కాపాడుతాయి.

అల్లం..
అల్లం లో యాంటీ ఇన్ల్ఫమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యకరమైన పని తీరుక పని చేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నివారించి వాపు సమస్య రాకుండా అల్లం రక్త సరఫరా మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

ఇదీ చదవండి: మొలకెత్తిన గోధుమల మిరాకిల్స్‌.. ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా?

యాపిల్స్..
యాపిల్‌లో పెక్టిన్ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్. ఇందులోని సహజసిద్ధమైన డైరక్టీవ్‌ కిడ్నీని క్లిన్స్ చేసి విష పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపించడంలో యాపిల్స్ మెరుగ్గా పనిచేస్తాయి.

పసుపు..
మనందరికీ తెలిసిన విషయమే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు కర్కుమిన్ కిడ్నీ సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.

ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసేవారు ఈ 3 నివారించాలి.. లేదంటే ఆ సమస్య ఎప్పటికీ వేధిస్తుంది..

దండేలియన్ రూట్ టీ..
ఈ టీ ని దండేలియన్ రూట్ నుంచి తయారుచేస్తారు. ఈ టీ తీసుకోవడం వల్ల డయారుటిక్ కిడ్నీ మెరుగైన పనితీరుకు సహాయపడుతుంది. ఇందులోంచి విష పదార్థాలను ఫిల్టర్ చేసి బయటికి పంపించి కడుపు ఉబ్బసం సమస్య రాకుండా కాపాడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News