International Yoga Day 2022: తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహించి.. శరీర సామర్థ్యాన్ని పెంచే యోగాసనాలు ఇవే!

Shavasana and Janu Sirsasana Increase Bodys Ability To Absorb Nutrients. మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది యోగా.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 08:05 PM IST
  • తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహించి
  • శరీర సామర్థ్యాన్ని పెంచే యోగాసనాలు ఇవే
  • జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
International Yoga Day 2022: తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహించి.. శరీర సామర్థ్యాన్ని పెంచే యోగాసనాలు ఇవే!

International Yoga Day 2022, Janu Sirsasana Increase Bodys Ability To Absorb Nutrients: యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా తయారవ్వవచ్చు. యోగా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు, శరీరం రెండూ ఎంతో ప్రశాంతగా, ఆరోగ్యంగా ఉంటాయి. యోగా చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఆందోళన, ఒత్తిడి తొలగిపోతాయి. అంతేకాకుండా మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది యోగా. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఓసారి చూద్దాం. 

జాను శీర్షాసనం:
సంస్కృతంలో జాను అనగా మోకాలు, శీర్షం అనగా తల. అందుకే దీన్ని జాను శీర్షాసనం అంటారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ భంగిమ ఉపయోగపడుతుంది. ఇది ఆహార శోషణను మరింత మెరుగుపరుస్తుంది. జాను శీర్షాసనం ఎలా చేయాలో చూద్దాం. మీ ఎడమ కాలును మడిచి నేలపై కూర్చోండి (మీరు సాధారణంగా మీ కాళ్లు మడిచి కూర్చునేలా). మీ కుడి కాలుని నిటారుగా ఉంచండి. మీ ఎడమ పాదంను కుడి తొడకు ఆనించాలి. ఇప్పుడు మీ రెండు చేతులను కుడి కాలు పదాన్ని పట్టుకోవాలి. ఈ సమయంలో మీ తల మీ కుడి కాలుకు ఎదురుగా ఉండాలి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి నెమ్మదిగా శ్వాస విడుదల చేయండి. దీన్ని  4-5  సార్లు పునరావృతం చేయాలి. 

తాడాసనం:
తాడాసనం రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది కండరాలలో పోషకాల శోషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు తాడాసనంను ఎలా చేయాలంటే.. పాదాలను కొంచెం దూరంగా ఉంచి నిల్చోవాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకోండి. తరువాత తల మీదుగా చేతులను పైకి ఎత్తాలి. పైకి ఎదురుగా ఉన్న అరచేతులతో వేళ్లను ఇంటర్‌లాక్ చేయండి. శ్వాస వదులుతూ భుజాలను చెవుల వైపు పైకి లేపండి. మీ భుజాలను వెనుకకు రోల్ చేసి వెన్నెముక వెపు తిప్పండి. ముఖం, కంటి కండరాలన్నింటినీ రిలాక్స్ కోసం భంగిమను స్థిరంగా కొనసాగించండి. సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోండి.

శవాసనం:
శవాసనం సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన యోగాసనాలలో ఒకటి. ఈ భంగిమను అన్ని వయస్సుల వారు చేయొచ్చు. శవాసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శవాసనం ఇలా వేయాలి. ముందుగా వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి. అరచేతులు పైకి ఉండాలి. శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి. శ్వాసను మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు. ఈ ఆసనం వేయు సమయంలో శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.

Also Read: Naga Chaitanya Dating: టాలీవుడ్‌ యువ హీరోయిన్‌తో నాగ చైతన్య డేటింగ్.. ఎవరో తెలిస్తే షాకే?

Also Read: Deepak Chahar Dance: సతీమణి ముందు తేలిపోయిన దీపక్‌ చహర్‌.. జయా భరద్వాజ్‌ డాన్స్ అదుర్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News