How To Control Uric Acid In 15 Days: చలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలా సాధారణం. మన చుట్టూ ఉన్న చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాదాల్లో వాపు, బిగుతు ఏర్పడం వల్ల నొప్పులు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జీవన శైలిలో మార్పులు, ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేపోతే తీవ్ర శరీర నొప్పులు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను కూడా వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి ఇంటి చిట్కాలు ఇవే:
1. శరీరంలో నీటి కొరత ఉండకూడదు:
నీరు శరీరానికి చాలా అవసరం. శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు కచ్చితంగా నీరు అధికంగా తాగాల్సి ఉంటుంది. ప్రతి రోజూ 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే శరీరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీర నొప్పులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. జీలకర్రా నీరు:
జీలకర్రా నీరు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు యూరిక్ యాసిడ్‌ను సులభంగా నియంత్రిస్తాయ. అయితే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ప్రభావవంతగా పని చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, శరీర నొప్పులున్న వారు ప్రతి రోజూ ఈ నీటిని తాగండి.
3. ఆలివ్ నూనె:
ఆలివ్ ఆయిల్ వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు గుండె ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read : Gaalodu Movie Review : గాలోడు రివ్యూ.. సుధీర్ మాస్ యాంగిల్
Also Read : Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook