High Cholesterol Symptoms: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా? అజాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధులు తప్పవు!

 High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి అతిగా కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కలిగిన ఆహారాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 28, 2023, 07:17 PM IST
 High Cholesterol Symptoms: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా? అజాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధులు తప్పవు!

High Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ లక్షణాలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా మధుమేహం సమస్యలు కూడా వస్తున్నాయి. 

చెడు కొలెస్ట్రాల్ క్షణాలను ముందుగానే గమనించి.. జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలను తినడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెరుగుతున్న కొలెస్ట్రాల్ కారణంగా రక్తంలో మార్పులు ఏర్పడి..ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది. దీని కారణంగా గుండెకు రక్తం సరఫరా ఆగిపోయి.. హార్ట్ ఎటాక్, గుండెల్లో నొప్పి, రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల ముందుగానే గమనించాల్సి ఉంటుంది.

Also Read: Rashmika Mandanna Hot Pics: పొట్టి డ్రెస్‌లో రష్మిక మందన్న.. కిర్రాక్ పోజులు ఇచ్చిన శ్రీవల్లి! వైరల్ పిక్స్

గుండె జబ్బులు తప్పవా?:
అధిక కొలెస్ట్రాల్ కారణంగా.. కరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడటం మొదలవుతుంది. దీంతో గుండెలోని కండరాలకు రక్తప్రసరణ కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంత మందిలో చక్కెర పరిమాణాలు కూడా అతిగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాల్లో కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 

కిడ్నీ దెబ్బతినడం:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కిడ్నీ దెబ్బతినడం, కిడ్నీల్లో రాళ్ల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కిడ్నీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రిణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rashmika Mandanna Hot Pics: పొట్టి డ్రెస్‌లో రష్మిక మందన్న.. కిర్రాక్ పోజులు ఇచ్చిన శ్రీవల్లి! వైరల్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News