కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ గడువును రెండో పర్యాయం పొడిగించడం తెలిసిందే. నేటి (మే 4) నుంచి మే 17వరకు తాజా లాక్డౌన్ అమలులో ఉంటుంది. అయితే దేశంలో గత ఏడు వారాలుగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కరోనా అదుపులోకి రాకపోగా, కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యం కాపాడుకునేందుకు చిన్న చిట్కాలు పాాటించాలి. ఈ విషయాలు తెలిస్తే మీరూ రక్తదానం చేస్తారు
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని సులువైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయడం శ్రేయస్కరం. శరీరం పునరుత్తేజానికి లోనవుతుంది. మనం తినే ఆహారంలో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
వేసవి అయినప్పటికీ చల్లని నీరు కాకుండా కాస్త గోరు వెచ్చని నీటిని తాగాలి. రోజులో కనీసం ఐదారు పర్యాయాలు వేడి నీటిని తాగడం వల్ల శరీరం ఉత్తేజితమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇది కోవిడ్19కి చికిత్స మాత్రం కాదని వైద్యులు సూచిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!