Health Tips: ఈ ఆరు పదార్ధాలు తీసుకుంటే..రక్తంలో వ్యర్ధాలు తొలగి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది

Health Tips: తినే ఆహార పదార్ధాల కారణంగా రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోయి..చర్మంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. రక్తం శుభ్రంగా లేకపోవడం వల్ల..ముఖంపై పింపుల్స్ వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. రక్తం శుభ్రంగా లేకపోవడం వివిధ వ్యాధులకు కారణమౌతుంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2022, 09:27 PM IST
Health Tips: ఈ ఆరు పదార్ధాలు తీసుకుంటే..రక్తంలో వ్యర్ధాలు తొలగి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది

శరీరానికి అతి ముఖ్యమైనది రక్తం. శరీరంలోని అన్నిఅంగాలకు కావల్సిన పోషకాల్నిఅందించేది రక్తమే. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. మరి ఈ వ్యర్ధాల్నిఎలా శుభ్రం చేయాలనేది తెలుసుకుందాం..

రక్తం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. రక్తంలో వ్యర్ధాలుంటే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. రక్తంలో వ్యర్ధ పదార్ధాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుభ్రం చేయడం చాలా అవసరం. డైట్‌లో కొన్ని వస్తువుల్ని చేర్చడం ద్వారా రక్తాన్ని శుభ్రం చేయవచ్చు.

తులసి

తులసిలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుల్లో ఉండే ఆక్సిజన్ కారణంగా రక్తం శుభ్రమౌతుంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధుల్ని దూరం చేయడంలో దోహదపడతాయి. తులసి అనేది ఇమ్యూన్ సిస్టమ్‌ను బలంగా చేస్తుంది. 

వేప

వేప రక్తాన్ని శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపాకుల్ని నమిలి తినడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్ధాలు దూరమౌతాయి. వేపాకులు శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా మార్చుతాయి.

బీట్‌రూట్

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో బీటో సయామిన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రం చేసే పని చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ లేదా బీట్‌రూట్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. చాలా వ్యాధుల్ని కూడా దూరం చేస్తుంది. 

పసుపు

పసుపు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఇందులో ఉండే కర్‌క్యూమిన్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. పసుపు తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. ఐరన్ లోపం దూరమౌతుంది. 

బెల్లం

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో పేరుకున్న వ్యర్ధాల్ని చాలా సులభంగా తొలగించగలదు. బెల్లం తినడం వల్ల ఐరన్ లోపం దూరమౌతుంది. బెల్లంతో జీర్ణ సంబంధిత సమస్యలైన అజీర్తి, మలబద్ధకం దూరమౌతాయి. బెల్లం తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. 

వెల్లుల్లి

వెల్లుల్లి రక్తానికి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల రక్తం శుభ్రమౌతుంది. బెల్లంతో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది. 

Also read: Weight Loss Diet: బరువు తగ్గడానికి కీటో డైట్‌ కంటే ప్రోలాన్ డైట్‌ బెస్ట్‌.. దీంతో వేగంగా బరువు తగ్గుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News