Gut Health: విటమిన్ల లోపం కూడా గట్ హెల్త్ సమస్యకు కారణమౌతుందా, ఏయే విటమిన్లు అవసరం

Gut Health: రోజువారీ జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే లోపాలు లేదా సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. శరీరం ఎదుర్కొనే అధికశాతం సమస్యలకు కారణం జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడమే. 

Last Updated : Nov 25, 2023, 08:59 PM IST
Gut Health: విటమిన్ల లోపం కూడా గట్ హెల్త్ సమస్యకు కారణమౌతుందా, ఏయే విటమిన్లు అవసరం

Gut Health: శరీరం ఆరోగ్యంగా ధృడంగా ఉండాలంటే వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ తప్పకుండా ఉండాలి. కేవలం ఆరోగ్యానికే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు కూడా విటమిన్లు దోహదం చేస్తుంటాయి. అందుకే విటమిన్ల లోపం లేకుండా చూసుకోవాలి. 

అన్నింటికంటే ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియ సక్రమంగా ఉండాలి. మనం ఎదుర్కొనే చాలా వ్యాధులకు లేదా అనారోగ్య సమస్యలకు మూలం ఇదే. కడుపు నుంచి అన్ని వ్యాధులకు బీజం ఏర్పడుతుందంటారు. మోతాదుకు మించి ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్  తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. అయితే విటమిన్ లోపం వల్ల కూడా అజీర్తి సమస్య తలెత్తవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే జీర్ణక్రియ సక్రమంగా ఉండేట్టు చూసుకోవాలి. జీర్ణక్రియ సక్రమంగా లేకపోతే గ్యాస్ , ఎసిడిటీ, మలబద్ధకం, అల్సర్ ఇలా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. 

విటమిన్ సి అనేది శరీరానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే విటమిన్ సితో ఇమ్యూనిటీ బలోపతమౌతుంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గట్ హెల్త్ బాగుండాలన్నా కూడా విటమిన్ సి చాలా అవసరం. దీనికోసం ఆరెంజ్, బత్తాయి, కివీ, నిమ్మకాయలు, ఆకు కూరలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావల్సినంత విటమిన్ సి లభిస్తుంది. 

మనిషి శరీరంలో గట్ హెల్త్ బాగుండేందుకు అవసరమైన మరో పోషకం విటమిన్ డి. ప్రకృతిలో విరివిగా సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. ఎముకలు బలంగా ఉండేందుకు దోహదపడుతుంది. విటమిన్ డి వల్ల శరీరంలో కాల్షియం సంగ్రహణ మెరుగుపడుతుంది. విటమన్ డి లోపంతో గట్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. సూర్యరశ్మి కాకుండా గుడ్లు, ఫ్యాటీ పిష్, ఫోర్టిఫైడ్ మిల్క్ వంటివాటిలో విటమిన్ డి లభిస్తుంది. 

ఇక విటమిన్ ఎ కూడా శరీరానికి చాలా అవసరం. ఇదొక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఈ విటమిన్ లోపంతో సహజంగా కంటి సమస్యలు తలెత్తుతాయి. కంటి చూపు తగ్గుతుంది. ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా గట్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. విటమిన్ ఎ కోసం గుడ్లు, బొప్పాయి, యానిమల్ లివర్, ఫిష్ ఆయిల్ మంచి ప్రత్యామ్నాయం.

విటమిన్ బి కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజూ విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల గట్‌లో మంచి బ్యాక్టిరీయ పెరుగుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. విటమిన్ బి కోసం తృణ ధాన్యాలు, పప్పులు, ఆకు కూరలు, మాంసం, గుడ్లు, చేపలు మంచి ప్రత్యామ్నాయం.

Also read: Belly Fat: పొట్ట చుట్టూ బెల్లీ ఫ్యాట్ సమస్యగా ఉందా, ఈ చిట్కాలు ట్రై చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News