Cholesterol signs: మీ ముఖంపై ఈ లక్షణాలు కన్పిస్తుంటే..కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నట్టే

Cholesterol signs: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ తరువాత అత్యంత కీలకమైంది కొలెస్ట్రాల్. ప్రపంచంలో ప్రతి పది మందిలో 5 గురికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కాదు. మరి ఈ సమస్య ఉంటే కన్పించే లక్షణాలేంటి, ముఖంపై ఎలాంటి సంకేతాలు కన్పిస్తాయనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2023, 04:07 PM IST
Cholesterol signs: మీ ముఖంపై ఈ లక్షణాలు కన్పిస్తుంటే..కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నట్టే

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా మూడు సమస్యలకు దూరంగా ఉండాలి. ఒకటి డయాబెటిస్. రెండు కొలెస్ట్రాల్. మూడవది అధిక రక్తపోటు. ఈ మూడూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగుండే వ్యాధులే. అందుకే వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. నియంత్రించుకోవాలి. మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే..ముఖంపై ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..

ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య సర్వ సాధారణంగా మారింది. ప్రతి పదిమందిలో ఐదుగురికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కాదు. డయాబెటిస్ రోగుల్లో కొలెస్ట్రాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది ఓ గంభీరమైన సమస్యే. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ లక్షణాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై కూడా లక్షణాలు కన్పిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..

కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై వేడి దద్దుర్లు ఏర్పడతాయి. ఇదేదో సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ముఖంపై వేడి దద్దుర్లు ఏర్పడ్డాయంటే కొలెస్ట్రాల్ ఉందని అర్ధం చేసుకుని తక్షణం తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

చర్మం రంగు మారడం

అధిక కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఒకటి చర్మం రంగు మారడం. అంటే ముఖం రంగు లైట్ బ్లాక్‌గా మారడం గమనించవచ్చు. కళ్ల చుట్టూ..చిన్న చిన్న గింజల్లా ఏర్పడతాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ముఖంపై దురద, ఎర్రని గింజలు

ముఖంపై తరచూ ఎక్కువగా దురదగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువైనట్టు భావించవచ్చు. దీర్ఘకాలంగా ముఖంపై దురద, రెడ్‌నెస్ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే..ముఖంపై, ముక్కుకు అటూ ఇటూ ఎర్రని చిన్న చిన్న గింజల్లా కన్పిస్తాయి. ఇవి కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సిరోసిస్ సమస్య

సిరోసిస్ సమస్యకు చాలా కారణాలున్నా..ముఖ్య కారణం కొలెస్ట్రాల్ కూడా. కొలెస్ట్రాల్ ఎక్కువైతే సిరోసిస్ సమస్య తలెత్తవచ్చు. ఎందుకంటే శరీరంలో డ్రైనెస్ రావడం వల్ల దురద, బ్లీడింగ్ సంభవిస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. డైట్, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే కొలెస్ట్రాల్ కేవలం 4 వారాల్లోనే తగ్గించవచ్చు.

Also read: Weight loss tips: రోజూ పరగడుపున ఇవి తింటే...కేవలం 6 వారాల్లో స్థూలకాయం మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News