Cashews Side Effects: జీడిపప్పు ఆరోగ్యానికి హానికరమా, రోజుకు ఎంత తినాలి

Cashews Side Effects: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరానికి కావల్సిన పోషక విలువలు ఇందులో మెండుగా ఉంటాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ పరిమితికి మించి తింటే ప్రమాదకరమా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2023, 06:02 PM IST
Cashews Side Effects: జీడిపప్పు ఆరోగ్యానికి హానికరమా, రోజుకు ఎంత తినాలి

Cashews Side Effects: డ్రై ఫ్రూట్స్‌లో చాలా రకాలున్నాయి. బాదం, జీడిపప్పు, వాల్‌నట్, పిస్తా, అంజీర్, ఖర్జూరం ఇలా చాలా రకాలున్నాయి. అన్నింటిలోనూ వివిధ రకాల పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకునేది జీడిపప్పు. జీడిపప్పుని బెస్ట్ సూపర్‌ఫుడ్‌గా కూడా పిలుస్తుంటారు. అయితే జీడిపప్పు మోతాదుకు మించి తింటే నష్టం కలుగుతుందని మీకు తెలుసా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రై ఫ్రూట్స్ పేరు వినగానే మొదటిగా గుర్తొచ్చేది జీడిపప్పు. చాలా రుచికరంగా ఉండటమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య విలువలు కలిగి ఉంటుంది. ప్రతి కిచెన్లో తప్పకుండా ఉంటుంది కూడా. ఎందుకంటే జీడిపప్పుని చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. జీడిపప్పు తినడం వల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో జీడిపప్పుని మోతాదుకి మించి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కూడా కలుగుతుంటుంది. అంటే ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు మోతాదుకు మించకూడదని అర్ధం. 

జీడిపప్పు బెస్ట్ సూపర్‌ఫుడ్ అయినా..ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. ఫలితంగా అదే పనిగా ఎక్కువ జీడిపప్పు తింటే స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే డయాబెటిస్, థైరాయిడ్ రోగులు జీడిపప్పుకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతారు. లేదా తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ మీది ఊబకాయమైతే జీడిపప్పు పూర్తిగా మానేయాలి. 

ఊపిరితిత్తుల సమస్య

జీడిపప్పులో ఐరన్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఐరన్ శరీరంలో మోతాదుకు మించితే సెల్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే అధికంగా తీసుకునే ఐరన్ సెల్స్‌లో పేరుకుపోతుంది. ఒకవేళ ఇదే ఐరన్ ఊపిరితిత్తుల్లోని సెల్స్‌లో పేరుకుపోతే ఆస్తమా లక్షణాలు అంటే ఆయాసం కన్పిస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమౌతుంటుంది. 

కిడ్నీలో రాళ్ల సమస్య

జీడిపప్పులో ఐరన్, కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా పెద్దమొత్తంలో ఉంటుంది. అందుకే జీడిపప్పు ఎక్కువగా తీసుకంటే కిడ్నీలో రాళ్ల సమస్య ఉత్పన్నం కావచ్చు. ఇప్పటికే మీకు కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే జీడిపప్పుని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. పొరపాటును కూడా తినకూడదు. ఎంత ఆరోగ్యకరమైందైనా సరే కిడ్నీ రోగులు మాత్రం జీడిపప్పుకు దూరంగా ఉండాలి.

డీహైడ్రేషన్ సమస్య

జీడిపప్పులో అధిక మోతాదులో ఉండే మరో పోషకం ఫైబర్. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సహజంగానే నీళ్లు తక్కువ తాగే పరిస్థితి ఉంటుంది. ఇది డీ హైడ్రేషన్‌కు దారి తీస్తుంది. కానీ ఫైబర్ పదార్ధాలు తీసుకున్నప్పుడు వాటిని జీర్ణం చేసేందుకు ఎక్కువ నీళ్లు తాగాలి. లేకపోతే శరీరంలో ఉన్న నీటిని ఫైబర్ సంగ్రహించడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. ఫలితంగా మలబద్ధకం వంటి సమస్య ఉత్పన్నం కావచ్చు. 

Also read: Control Diabetes: కాకర చిప్స్‌తో 25 నిమిషాల్లో మధుమేహం మాయం! ఎప్పుడైన ట్రై చేశారా?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News