High Cholesterol Tips: శరీరంలో ఈ లక్షణాలుంటే కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు అర్ధం, తస్మాత్ జాగ్రత్త

High Cholesterol Tips: ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. సాధారణ సమస్యే అయినా నిర్లక్ష్యం వహిస్తే విషమించి ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా యుక్త వయస్సుకే ఈ సమస్య వచ్చి పడుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2023, 04:03 PM IST
High Cholesterol Tips: శరీరంలో ఈ లక్షణాలుంటే కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు అర్ధం, తస్మాత్ జాగ్రత్త

High Cholesterol Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ సమస్య పెరగడమంటే హార్ట్ ఎటాక్, డయాబెటిస్ ముప్పు పెరగడమే. ఒకప్పుడు 40 వయస్సు దాటితే ఎదురైన సమస్య ఇప్పుడు పిన్న వయస్సుకే వెంటాడుతోంది. కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొన్ని సంకేతాలు కన్పిస్తాయి.

చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి కారణంగా గుండె వ్యాధులు, మానసిక సమస్యలు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకర సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇటీవలికాలంలో 25-35 ఏళ్లకే ఈ సమస్య ఎదురౌతోంది. కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని లక్షణాలు కన్పిస్తే అప్రమత్తం కావాలి. ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తిస్తే వెంటనే చికిత్స చేయించుకోవచ్చు. 

కళ్లపై పసుపు మచ్చలు లేదా చారలు కన్పిస్తే తక్షణం జాగ్రత్త పడాలి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. రక్తంలో కొవ్వు పెరిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.

ఎవరైనా మనిషి మెడ, దవడ, కడుపు, వీపు భాగంలో నొప్పి వస్తుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్ధం చేసుకోవాలి.

చేతిలో తిమ్మిరిగా ఉండటం లేదా చీమలు కుట్టినట్టుగా అన్పించడం జరిగితే కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుందని అర్ధం. శరీరంలోని ఆన్ని భాగాలకు ఆక్సిజన్ సహిత రక్తం చేరనప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. అంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడే రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుంది. 

చెమట పట్టడం, చికాకు కూడా కొలెస్ట్రాల్ లక్షణాలే. రక్తం తగిన పరిమాణంలో గుండె వరకూ చేరనప్పుడు, గుండె తక్కువ రక్తాన్నే పంపింగ్ చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. 

కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు కన్పించే ఈ లక్షణాల్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. నిర్లక్ష్యం చేయడం వల్ల వివిధ రకాల ఇతర సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా సకాలంలో చికిత్స కూడా చేయించుకోవాలి.

Also read: Papaya Seeds: బొప్పాయి గింజలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ డస్ట్ బిన్‌లో వేయరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News