Kidneys Health: కిడ్నీ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే డైట్‌లో ఈ మార్పులు తప్పవు

Kidneys Health: శరీరంలో గుండె ఎంత ముఖ్యమైన అంగమో, కీడ్నీలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీల పాత్ర అత్యంత కీలకం. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2023, 03:50 PM IST
Kidneys Health: కిడ్నీ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే డైట్‌లో ఈ మార్పులు తప్పవు

Kidneys Health: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు, లివర్ మూడింటికీ విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వీటిలో ఏది విఫలమైనా ఇతర అంగాలపై ప్రభావం పడి ప్రాణాంతకం కాగలదు. అన్నింటికంటే ఎక్కువ కిడ్నీలు. మనిషిని ఆరోగ్యంగా ఉంచేవి కిడ్నీలే. కిడ్నీ వ్యాధి సమస్య ఉంటే డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంగాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలు కీలక భూమిక పోషిస్తాయి. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు డీటాక్స్ చేయడంలో కిడ్నీల పాత్ర కీలకం. కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేస్తే జీవితం నరకప్రాయమౌతుంది. అందుకే కిడ్నీ సమస్యలుండే వ్యక్తి డైట్ సరిగ్గా ఉండాలి. తద్వారా కిడ్నీల పనితీరు మెరుగుపడవచ్చు. మీరు కూడా కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతుంటే డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. కిడ్నీ వ్యాధులుంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

కిడ్నీ వ్యాధిగ్రస్థులు సాధ్యమైనంతవరకూ తేలికైన ఆహారం తీసుకోవాలి. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మాంసాహారం పూర్తిగా మానేయాలి. మసాలా పదార్ధాలు, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీలపై దుష్ప్రభావం చూపిస్తాయి. రోజూ రాత్రి వేళ పండ్లు తింటే మంచిది. ఎప్పటికప్పుడు లభించే సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంటుంది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి పడదు. 

రోజూ కనీసం 3 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కిడ్నీల పనితీరు మెరుగుపర్చుకోవచ్చు. స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు ఇందుకు సరైన ప్రత్యామ్నాయం. కొవ్వు లేని పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఇలా డైట్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి పనితీరు మెరుగుపడుతుంది. 

శరీరం ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసేందుకు నిమ్మరసం, కీరా, దోసకాయ వంటివి తరచూ తీసుకోవాలి. శరీరం డీటాక్స్ అయ్యే కొద్దీ కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంంటుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ మంచి పరిష్కారం.

Also read: Healthy Breakfast: బలమైన ఇమ్యూనిటీ కావాలంటే రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకోవల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News