Chia Seeds: మధుమేహం వ్యాధిగ్రస్థులు చియా సీడ్స్ తినవచ్చా లేదా

Chia Seeds: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా కన్పిస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. డయాబెటిస్ వ్యాధి నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. అయితే ప్రకృతిలో లభించే కొన్ని పదార్దాలతో డయాబెటిస్ నియంత్రించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 29, 2023, 03:53 PM IST
Chia Seeds: మధుమేహం వ్యాధిగ్రస్థులు చియా సీడ్స్ తినవచ్చా లేదా

Chia Seeds: ఇందులో భాగంగానే చాలామంది డయాబెటిస్ నియంత్రణసు చియా సీడ్స్ అధికంగా వినియోగిస్తుంటారు. అసలు మధుమేహం నియంత్రణకు చియా సీడ్స్ ఎంత వరకూ ప్రయోజనకరం, మధుమేహ వ్యాదిగ్రస్తులు చియా సీడ్స్ సేవించవచ్చా లేదా అనేది తెలుసుకుందాం..

ఆధునిక జీవన విధానంలో వివిధ రకార ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. ఒకసారి మధుమేహం వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంటుంది. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి అవలర్చుకుంటే మధుమేహాన్ని ఎప్పటికీ నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. ఆహారపు అలవాట్లపై నియంత్రణ లేకపోతే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటిస్ పెరగడమంటే గుండెపోటు, కిడ్నీ వ్యాధుల్ని ఆహ్వానించడమే అవుతుంది. ఈ క్రమంలో చియా సీడ్స్ ఏ మేరకు ఉపయోగమో తెలుసుకుందాం..

చియా సీడ్స్‌లో ఫైబర్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ కారణంగా ఎదురయ్యే సమస్యల్ని చియా సీడ్స్ తగ్గిస్తాయి. హెల్తీ డైట్‌తో పాటు చియా సీడ్స్ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్, స్థూలకాయం తగ్గుతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్, స్థూలకాయం తగ్గుతాయో మధుమేహం ముప్పు కూడా తగ్గిపోతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో దోహదం చేస్తాయి. 

చాలామందికి చియా సీజడ్స్ గురించి తెలిసినా ఎలా వినియోగించాలనే విషయంలో స్పష్టత ఉండదు. చియా సీడ్స్‌తో పాయసం చేసుకుని తాగితే రుచి కూడా పెరుగుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులు మాత్రం తీపి లేకుండానే తీసుకోవల్సి వస్తుంది. 2 చెంచాల చియా సీడ్స్ ఓ గ్లాసు నీళ్లలో వేసి ఇందులో నిమ్మకాయ రసం కొద్దిగా పిండి గంటసేపు వదిలేయాలి. ఆ తరువాత గింజలతో సహా తాగేయాలి. కొంతమంది చియా సీడ్స్‌ను ఫ్రూట్ జ్యూస్‌తో కలిపి తాగుతుంటారు. యాపిల్, నారింజ, పుచ్చకాయ జ్యూస్‌తో కలిపి తాగుతుంటారు. మరి కొంతమంది సలాడ్‌తో కలిపి తీసుకుంటారు. నీళ్లలో ఓ గంట నానబెట్టి నిమ్మరసం కొద్దిగా పిండి రోజూ పరగడుపున ఉదయం తాగితే మంచి ఫలితాలుంటాయి. రోజూ మద్యాహ్నం భోజనానికి కాస్సేపు ముందు కూడా ఇలానే సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. 

మొత్తానికి చియా సీడ్స్ డయాబెటిస్ వ్యాధి గ్రస్థులకు ప్రయోజనకరమని తెలుస్తోంది. కానీ అవసరానికి మించి తీసుకుంటే మాత్రం దుష్పరిణామాలు ఎదురు కావచ్చు. చియా సీడ్స్ అతిగా తీసుకుంటే డయేరియా వంటి సమస్యలు తలెత్తవచ్చు.అంతేకాకుండా చర్మం ఎలర్జీ ఉండవచ్చు. బీపీ రోగులు తక్కువగా తీసుకోవాలి.

Also read: Chia Seeds For Weight Loss: ఈ గింజలతో బరువు తగ్గడం సులభం..వేగంగా వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునేవారు ట్రై చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News