Health Care Tips: రోజూ ఇది తాగితే చాలు శరీరంలో కొలెస్ట్రాల్ ఇట్టే మాయం

Health Care Tips: ఆధునిక జీవనశైలి కారక వ్యాధుల్లో ప్రధానమైంది ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే పలు ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2023, 04:57 PM IST
Health Care Tips: రోజూ ఇది తాగితే చాలు శరీరంలో కొలెస్ట్రాల్ ఇట్టే మాయం

Health Care Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు చాలామంది చాలరకాలుగా చెబుతుంటారు. ఏ చిట్కా పనిచేసినా చేయకపోయినా..మజ్జిగ మాత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌తో పాటు శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి.

స్థూలకాయం అనేది ఇటీవలి జీవనశైలిలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్య. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. శరీర బరువు సీజన్‌ను బట్టి కూడా పెరుగుతుంటుంది. అంటే వేసవితో పోలిస్తే చలికాలంలో బరువు ఎక్కువ పెరగడం గమనించవచ్చు. కారణం ఒక్కటే. ఆయిలీ పదార్ధాలు ఎక్కువగా తీసకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లోపించడం. అందుకే ఎప్పటికప్పుడు అంటే సకాలంలో శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించగలిగితే..గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

కొలెస్ట్రాల్ పెరిగితే కలిగే వ్యాధులు

అధిక రక్తపోటు, డయాబెటిస్, స్థూలకాయం, హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వేసల్ డిసీజ్.

కొలెస్ట్రాల్‌ను మజ్జిగ ఎలా దూరం చేస్తుంది

మజ్జిగలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, గుడ్ బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్, కాల్షియం వంటి ఆరోగ్యకరమైన గుణాలున్నాయి. ఇవి శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించడంలో దోహదపడతాయి. మజ్జిగను క్రమం తప్పకుండా డైట్‌లో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

మజ్జిగ సైడ్ ఎఫెక్ట్స్

అలాగని అదే పనిగా మజ్జిగ సేవించడం కూడా మంచిది కాదు. ఆరోగ్యపరంగా నష్టం కలుగుతుంది. ఎందుకంటే మజ్జిగలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారికి ఇది హాని చేకూరుస్తుంది. జలుబు వంటి సమస్యలున్నప్పుడు కూడా మజ్జిగ మంచిది కాదు. ఎలర్జీ ఉన్నవాళ్లు కూడా మజ్జిగకు దూరంగా ఉండాలి. 

Also read: Heart Attack Risk: జిమ్ వెళ్తున్నా గుండెపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఏం జాగ్రత్తలు పాటించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News