Winter Diet: ఈ ఆకు కూరలు తింటే చలికాలం వ్యాధులన్నింటికీ చెక్ చెప్పవచ్చు

Winter Diet: మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. సీజన్ మారినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే చలికాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2023, 06:52 PM IST
Winter Diet: ఈ ఆకు కూరలు తింటే చలికాలం వ్యాధులన్నింటికీ చెక్ చెప్పవచ్చు

Winter Diet: సాధారణంగా చలికాలం ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండవచ్చేమో గానీ ఆరోగ్యపరంగా మంచిది కాదు. చలికాలంలో మనిషి శరీరంలోని ఇమ్యూనిటీ పడిపోవడంతో వివిధ రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చలికాలంలో డైట్ జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..

శీతాకాంలో వచ్చిందంటే  వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే చలి గాలుల వల్ల, ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల సీజనల్ వ్యాధులైన ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గుతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కూడా దాడి చేస్తాయి. ఆస్తమా రోగులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరవచ్చు. ఈ అన్ని సమస్యల్నించి బయటపడాలంటే ఆకుకూరలు మంచి ప్రత్యామ్నాయం. చలికాలంలో ఆకు కూరలు వివిద రకాల వ్యాధుల్నించి కాపాడేందుకు దివ్యౌషంగా పనిచేస్తాయి. ఇందులో ముఖ్యమైనవి ఆవ ఆకులు. ఆవ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమన్ బి, మినరల్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయి. మలబద్ధకం, మధుమేహం, కామెర్లు వంటి వ్యాధుల్నించి రక్షణ కల్పిస్తాయి. 

ఇక చలికాలంలో ఎక్కువగా తీసుకోవల్సింది కొత్తిమీర. ఇందులో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, బీపీ నియంత్రిత గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కొత్తిమీరను రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమౌతాయి. చలికాలంలో లభించే మరో ఆకు కూర ఎర్ర బచ్చలి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, రిబోఫ్లేవిన్, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే చలికాలంలో ఎర్రబచ్చలి కూరను డైట్‌లో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఇక మెంతి కూర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం పెద్దఎత్తున ఉంటాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలు మెంతి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. శీతాకాలంలో విరివిగా లబించే పాలకూరను అస్సలు మిస్ కావద్దు. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పోలీశాచ్యురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల నుంచి రక్షణ లబిస్తుంది. బతువా ఆకులు కూడా శీతాకాలంలోనే అందుబాటులో ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. దీనివల్ల గ్యాస్,  మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు దూరమౌతాయి.

Also read: Teeth Cavity: కేవిటీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పళ్లు మొత్తం పుచ్చిపోగలవు, ఈ జాగ్రత్తలు తీసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News