Digestive Tips: జీర్ణక్రియ అనేది పూర్తిగా మనం తీనే ఆహార పదార్ధాలను బట్టి ఉంటుంది. ఆధునిక బిజీ ప్రపంచంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలన్నీ జీర్ణక్రియ సంబంధమైనవే. కొన్ని రకాల ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు.
మనిషి శరీరంలో అనారోగ్యమైనా, ఆరోగ్యమైనా కేంద్ర బిందువు కడుపు. తినే ఆహారం ప్రోసెస్ అయ్యేది చేరేది అక్కడికే కాబట్టి. అందుకే జీర్ణక్రియ సక్రమంగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి పలు సమస్యలు ఎదురౌతుంటాయి. అయితే రోజూ ఉదయం పరగడుపున కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు.
ప్రతిరోజూ ఉదయం కూరగాయల జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కావల్సిన పరిమాణంలో లభ్యమౌతాయి. శరీరంలోని మలినాలు బయటకు తొలగిపోతాయి. ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయం ఖాళీ కడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
రాత్రంతా నానబెట్టిన వాల్‌నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, అవిశె గింజలు, గుమ్మడి గింజలు రోజుకొకిటి చొప్పున మార్చుకుంటూ తింటుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా జీర్ణ సంబందిత సమస్యలు ఎదురుకావు. మెదడు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. బొప్పాయి కూడా చాలా మంది ప్రత్యామ్నాయం. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం హెల్తీగా మారుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. నోటి పూత సమస్య పోతుంది. జీర్ణక్రియ బాగుంటుంది.
సోంపు అనేది కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యను అద్భుతంగా తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజూ భోజనం తరువాత కొద్దిగా సోంపు నోట్లో వేసి నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన కూడా ఉండదు. ప్రతి రోజూ ఉదయం వేళ అరటి పండ్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ వల్ల డయాబెటిస్ అదుపులో ఉండటమే కాకుండా జీర్ణక్రియ బాగుంటుంది.
Also read: Winter Skin Tips: శీతాకాలంలో చర్మం డ్రైగా ఎందుకు మారిపోతుంటుంది, కారణాలేంటి, ఎలా రక్షించుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook