Dates Benefits: బీపీ, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా, రోజూ మూడు తింటే చాలు ఇట్టే మాయం

Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో అత్యంత విలువైంది ఖర్జూరం అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. పండ్లలో హై ప్రోటీన్డ్ ఇదే. అందుకే ఖర్జూరంతో మరణం తప్ప అన్నింటికీ సమాధానం ఉందంటారు. పూర్తి వివరాలు మీ కోసం,

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 1, 2024, 05:57 PM IST
Dates Benefits: బీపీ, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా, రోజూ మూడు తింటే చాలు ఇట్టే మాయం

Dates Benefits: పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీర నిర్మాణంలో అవసరమైన  పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు. వీటన్నింటిలో ముఖ్యమైంది ఖర్జూరం. ఖర్జూరం డైట్‌లో ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాటల్లో చెప్పలేం. 

రోజు 2-3 ఖర్జూరం పండ్లు తినడం అనేది దైనందిక జీవితంలో  మంచి అలవాటు. అన్నింటికంటే ముందు ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఎప్పటికీ ఉత్పన్నం కాదు. దీనికోసం రోజుకు 3 ఖర్జూరం పండ్లు తప్పకుండా తీసుకోవాలి. 

ఖర్జూరంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు భారీగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి కావల్సినంత ఎనర్జీ లభిస్తుంది. రోజుకు 3 ఖర్జూరం పండ్లు తింటే చాలు రోజంతా ఎనర్జీ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫోలెట్, విటమిన్ బి6 కారణంగా మెదడు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే జ్ఞాుపకశక్తి, లెర్నింగ్, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. 

ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లతో పాటు మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. రోజూ 3 ఖర్జూరం పండ్లు తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్య ఉత్పన్నం కాదు. దీంతోపాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఎనీమియా సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. బలహీనత దూరమౌతుంది. 

ఖర్జూరం ఎలాగైనా తినవచ్చు. డ్రై లేదా వెట్ ఏదైనా సరే మంచిదే. బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి లేదా స్నాక్స్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. రోజూ పరగడుపున తింటే అన్నింటికంటే అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి. 

Also read: Vande Metro Trains: త్వరలో వందే మెట్రో రైళ్లు ప్రారంభం, ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News