Covid-19 During Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు కరోనావైరస్ సోకితే పిల్లలకు ఆరోగ్యానికి ప్రమాదామా ?

Covid-19 During Pregnancy Time: ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్‌ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు.

Written by - Pavan | Last Updated : Mar 31, 2023, 06:20 PM IST
Covid-19 During Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు కరోనావైరస్ సోకితే పిల్లలకు ఆరోగ్యానికి ప్రమాదామా ?

Covid-19 During Pregnancy Time: గర్భంతో ఉన్నప్పుడు కొవిడ్-19 సోకితే.. వారికి పుట్టబోయే చిన్నారుల ఆరోగ్యంపై అది దుష్బ్రభావం చూపిస్తుందా అంటే ఒక అధ్యయనం అవుననే చెబుతోంది. ఎండోక్రైన్ సొసైటికీ చెందిన ఎండోక్రైనాలజీ అండ్ మెటాబాలిజం జర్నల్ ప్రచురించిన వివరాల ప్రకారం గర్భంతో ఉన్న సమయంలో స్త్రీలకు కరోనావైరస్ సోకితే.. ఆ తరువాత వారికి పుట్టబోయే పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని తెలుస్తోంది. ఈ జర్నల్‌లో ప్రచురించిన వివరాలు ఏం చెబుతున్నాయంటే.. కరోనావైరస్ సోకిన ప్రెగ్నెంట్ లేడీస్‌కి పుట్టిన శిశువులు తొలుత తక్కువ బరువుతో పుట్టి.. తొలి ఏడాది కాలంలోనే అధిక బరువు పెరిగినట్టు అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్‌ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే.. గర్భంతో ఉన్నప్పుడు కొవిడ్-19 తో బాధపడిన స్త్రీలకు పుట్టిన చిన్నారులకు పసి ప్రాయంలోనే స్థూలకాలం బారినపడటంతో పాటు చిరుప్రాయంలో కానీ లేదా పెరిగి పెద్దయ్యే క్రమంలో కానీ వారు మధుమేహం, గుండె సంబంధిత జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది.

ఈ పరిశోధనకు నిధులు సమకూర్చిన సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి..
నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇనిస్టిట్యూట్, 
ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్, 
ది యూనిస్ కెన్నెడి శ్రివర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్, 
హార్వర్డ్‌లోని ది న్యూట్రిషన్ ఒబేసిటీ రిసెర్చ్ సెంటర్, 
ది బోస్టన్ ఏరియా డయాబెటిస్ ఎండోక్రైనాలజీ రిసెర్ట్ సెంటర్, 
ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జి అండ్ ఇన్ ఫెక్సియస్ డిసీజెస్, 
ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్,
ది సైమండ్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఈ అధ్యయనానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చాయని పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తి మొదలై నాలుగేళ్లు కావస్తుండటంతో పాటు తాజాగా మరోసారి కొత్త కొత్త వైరస్‌లు, వేరియంట్స్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఈ తరహా అధ్యయనాల ఫలితాలు మరోసారి వెలుగులోకొస్తుండటం గమనార్హం.

ఇది కూడా చదవండి : Side Effects Of Soap On Face: ముఖానికి సబ్బు రాసుకునే వాళ్లకు ఇది తెలిస్తే.. మళ్లీ ఆ పనిచేయరు

ఇది కూడా చదవండి : 

ఇది కూడా చదవండి : 

Trending News