Cholesterol Tips: ఆ ఒక్క కూరగాయతో కొలెస్ట్రాల్‌కు పదిరోజుల్లో చెక్, షుగర్, బీపీ నియంత్రణ

Cholesterol Tips: కూరగాయలు ఆరోగ్యానికి మంచివంటారు. కానీ కొలెస్ట్రాల్ రోగులకు మాత్రం కొన్ని కూరగాయలు శత్రువు కంటే ఎక్కువే. అందుకే కొలెస్ట్రాల్ బాధితులు కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 30, 2022, 04:09 PM IST
Cholesterol Tips: ఆ ఒక్క కూరగాయతో కొలెస్ట్రాల్‌కు పదిరోజుల్లో చెక్, షుగర్, బీపీ నియంత్రణ

Cholesterol Tips: కూరగాయలు ఆరోగ్యానికి మంచివంటారు. కానీ కొలెస్ట్రాల్ రోగులకు మాత్రం కొన్ని కూరగాయలు శత్రువు కంటే ఎక్కువే. అందుకే కొలెస్ట్రాల్ బాధితులు కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. ఆ వివరాలు మీ కోసం..

జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఏది పడితే అది తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడమంటే హార్ట్ ఎటాక్, డయాబెటిస్ ముప్పు వెంటాడుతున్నట్టే అర్ధం. మెరుగైన ఆరోగ్యం కోసం మీ డైట్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు..కొన్ని కూరగాయలు తినకూడదు. కొన్నింటిని తినవచ్చు. కొన్ని కూరగాయల వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండజా..బ్లడ్ షుగర్ కూడా నియంత్రితమౌతుంది. 

బెండకాయ కొలెస్ట్రాల్ రోగులకు చాలా మంచిది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఇందులో ఉండే పేక్టిన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గిందో..సహజంగానే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ అనేది చాలా రకాల సమస్యలకు కారణమౌతుంటుంది. అందుకే ముందుగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్ కడుపుకు సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెండకాయ తినడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. డయాబెటిస్ రోగులకు కూడా ఇది ఉపయోగకరం.

బెండకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడం, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటమే కాకుండా..శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచడంలో బెండకాయ పాత్ర కీలకం. బెండకాయను రోజూ డైట్‌లో చేర్చుకుంటే అద్బుతమైన ఫలితాలుంటాయి. కొలెస్ట్రాల్ తగ్గి..అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.

Also read: Moong Dal Side Effects: షుగర్‌ పేషెట్స్ అస్సలు పెసర పప్పును తినొద్దు.. తింటే అంతే సంగతి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News