Winter Drinks: చలి తట్టుకోవాలంటే...రోజూ ఈ డ్రింక్స్ తాగితే చాలు

Winter Drinks: చలికాలంలో సహజంగానే ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. అందుకే త్వరగా ఇన్‌ఫెక్షన్ సోకుతుంటుంది. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2022, 09:41 PM IST
Winter Drinks: చలి తట్టుకోవాలంటే...రోజూ ఈ డ్రింక్స్ తాగితే చాలు

చలికాలంలో వివిద రకాల ఇన్‌ఫెక్షన్‌లు, వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే ముందు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత కూడా వేడిగా ఉండటం మంచిది. దీనికోసం ఏం చేయాలి, ఎలాంటి డ్రింక్స్ సేవించాలనేది పరిశీలిద్దాం.

చలికాలంలో రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. అందుకే వివిధ రకాల వ్యాధుల త్వరగా ఎటాక్ చేస్తుంటాయి. తరచూ జలుబు, దగ్గు సమస్యలు ఎదురౌతుంటాయి. చలికాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు చాలా వేగంగా వ్యాపిస్తుంటాయి. అందుకే చలికాలంలో శరీరాన్ని సాధ్యమైనంతవరకూ వెచ్చగా ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం కొన్ని డ్రింక్స్ సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..

చలికాలంలో వేడి కోసం తీసుకోవల్సిన డ్రింక్స్

బాదం పాలు

చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు బాదం పాలు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఎందుకంటే స్వభావరీత్యా బాదం పాలు వేడి అందిస్తాయి. బాదం పాలులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. అంతేకాదు..ఇమ్యూనిటీ పెరుగుతుంది.

టొమాటో సూప్

చలికాలంలో టొమాటో సూప్ తాగడం చాలా మంచిది. చాలా ప్రయోజనాలున్నాయి. టొమాటోలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. రోజూ టొమాటో సూప్ తాగుతుంటే..శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

అల్లం డికాషన్

చలికాలంలో చాలామంది అల్లం ఎక్కువగా వినియోగిస్తారు. అల్లం స్వభావరీత్యా వేడిది కావడంతో చలికాలంలో ప్రయోజనకరం. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు అల్లంతో కాడా లేదా డికాషన్ చేసి తాగాలి. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలు వేయాలి. బాగా ఉడికిన తరువాత వడకాచి..కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.

పసుపు పాలు

చలికాలంలో పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. చలికాలంలో రోజూ రాత్రి వేళ పసుపు కలిపిన పాలు తాగితే..రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా..శరీరం అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది. పసుపు పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు అధికం. అందుకే రోజూ తాగితే మంచిది. 

Also read: Black Raisins Benefits: మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్, గుండె సమస్యలకు శాశ్వతంగా నల్ల ఎండు ద్రాక్షలతో చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News